విద్యార్థులకు ప్రధాని సందేశం

Published: Monday February 04, 2019
అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా విద్యను అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. రాష్ర్టీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ (రూసా 2.0), ఏపీ ఉన్నత విద్యాశాఖల సౌజన్యంతో రూ.5 కోట్ల వ్యయంతో ఏలూరులోని సెయింట్‌ థెరిసా మహిళా కళాశాలలో ‘ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ కెరీర్‌హబ్‌’ను నెలకొల్పారు. దీనిని జమ్ముకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌ నుంచి రిమోట్‌ సాయంతో ప్రధాని ఆదివారం ప్రారంభించారు.
 
థెరిసా కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై ప్రధాని ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమా న్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా 151 వర్సిటీలు, కళాశాలలు, మోడల్‌ డిగ్రీ కళాశాలలను ప్రధాని ఏకాలంలో రిమోట్‌ ద్వారా ప్రారంభించారు.
 
à°ˆ కార్యక్రమం అనంతరం తెలంగాణ, అసోం, హరియాణ, ఒడిసా, గుజరాత్‌ రాష్ర్టాల విద్యార్థులతో మాట్లాడారు. కాగా, కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని గిరియాంపేటలో ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణానికి ప్రధాని ఆదివారం డిజిటల్‌ శంకుస్థాపన చేశారు. పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు అధ్యక్షతన జరిగిన à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిఽథులుగా పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు.