అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఆందోళన

Published: Thursday February 07, 2019
 à°šà±à°•à±à°•à°²à°¤à±‹à°ªà°¾à°Ÿà±, సాధారణ భూముల విషయంలోనూ సామాన్యులు, ప్రజాప్రతినిధులకు రెవెన్యూశాఖ చుక్కలు చూపిస్తోందని ఎమ్మెల్యేలు శాసనసభలో ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం ఎమ్మెల్యే రాజగోపాల్‌ చుక్కల భూములపై ప్రశ్న లేవనెత్తగా ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమాధానమిచ్చారు. చుక్కల భూముల చట్టం తీసుకొచ్చామని, సమస్యల పరిష్కారానికి చట్టసవరణ కూడా ప్రతిపాదించామని వివరించారు.
 
1954కు ముందు అసైన్‌ చేసిన భూములను 22-ఏ నుంచి తొలగించాలని ఉత్తర్వులు ఇచ్చామన్నారు. మంత్రి సమాధానంతో సభ్యులు శాంతించలేదు. బీజేపీపక్షనేత విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ చుక్కల భూములతోపాటు, ప్రైవేటు భూములను కూడా 22-ఏ జాబితాలో చేర్చి ఆవేదన కలిగిస్తున్నారన్నారు. ఎండాడ, మధురవాడను నిషేధ జాబితాలో చేర్చారని ఆరోపించారు. గతంలో ప్రజలు రేషన్‌, పెన్షన్‌ కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగారని, ఇప్పుడు భూ సమస్యలపై తమ వద్దకు వస్తున్నారని చెప్పారు. ఆపిల్‌ ఫోన్లు ఇస్తే తప్ప 22-ఏ నుంచి తొలగించడం లేదని ఆరోపించారు. వెలగపూడి రామకృష్ణ మాట్లాడుతూఅన్ని రకాల అనుమతులున్న లే అవుట్‌లు, ప్రైవేటు భూములను కూడా 22-ఏలో చేర్చారని, నాలుగున్నరేళ్లుగా రెవెన్యూ చుట్టూ తిరిగినా తమ సమస్య పరిష్కారం కాలేదన్నారు.
 
విశాఖ బీచ్‌రోడ్‌, సీతమ్మధార, చివరకు తమ ఇంటిని కూడా నిషేధ జాబితాలో చేర్చారని ఆరోపించారు. దీనిపై కేఈ స్పందిస్తూ.. వివాదాల పరిష్కారానికి భూదార్‌ తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఇంకా సమస్యలు పరిష్కారం కాకపోతే తనకు లేఖ రాయాలని సూచించారు. అయితే, తాము à°’à°• సమస్య లేవనెత్తితే మంత్రి మరోదానికి బదులిస్తున్నారంటూ సభ్యులు నిట్టూర్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇప్పుడైనా నిధులు కేటాయిస్తే అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. మంత్రి యనమల స్పందిస్తూ.. విష్ణుకుమార్‌రాజు వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారన్నారు. నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నిధులివ్వడం లేదని చెప్పారు.