శ్రీకాకుళంలో బౌద్ధం ఆనవాళ్లు

Published: Sunday February 10, 2019

 à°•à±ƒà°·à±à°£à°¾à°œà°¿à°²à±à°²à°¾ ఘంటసాల మండలం శ్రీకాకుళంలో బౌద్ధం ఆనవాళ్లు లభించినట్టు ప్రముఖ పురాతత్వ పరిశోధకుడు, కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ-అమరావతి సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఆంధ్రా ఆర్ట్స్‌ అకాడమీ కార్యదర్శి గోళ్ల నారాయణరావుతో కలసి శనివారం ఆయన శ్రీకాకుళంలో పర్యటించారు. ఏకరాతి ప్రసన్న మల్లికార్జునస్వామి ఆలయం వెనుక బౌద్ధస్థూపాన్ని చిత్రించిన పల్నాడు సున్నపురాతి శిలాఫలకాలు రెండు, శాతవాహనుల కాలం నాటి ఇటుకరాతి శకలాలను గుర్తించారు. à°ˆ ఆనవాళ్ల బట్టి శ్రీకాకుళం à°’à°• బౌద్ధక్షేత్రమని తేలిందని, à°ˆ విషయాన్ని అసెంబ్లీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లగా, ఇక్కడ పరిశోధనలు జరపాల్సిన అవసరముందని సూచించారని శివనాగిరెడ్డి తెలిపారు.