కన్నీటిపర్యంతమైన వైసీపీ మహిళా

Published: Tuesday February 12, 2019
 à°µà±ˆà°¸à±€à°ªà±€à°²à±‹ మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని జిల్లా మహిళా సేవాదళ్‌ కార్యదర్శి సుహాసినీ రెడ్డి ఆరోపించారు. సోమవారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ , జగన్‌ మీద అభిమానంతో తాను తొలి రోజుల్లోనే వైసీపీలో చేరానన్నారు. అప్పట్లో టీడీపీలో వున్న ఆరణి శ్రీనివాసులు దేశద్రోహి అని నిందిస్తూ జగన్‌ దిష్టి బొమ్మలు దహనంం చేశారన్నారు. 2014లో టీడీపీలో ఎమ్మెల్యే టికెట్‌ రాకపోవడంతో వైసీపీకి మారారని చెప్పారు. తొలినుంచీ పార్టీకోసం పనిచేస్తున్న మహిళలకు ఆయన ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా వున్న గాయత్రీదేవిని కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంచారని చెప్పారు.
 
పార్టీ కోసం తాను కుటుంబానికి కూడా దూరమయ్యానని , పార్టీ కార్యక్రమాలకు లక్షల రూపాయలు ఖర్చుచేస్తున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యారు .తాను వేరే వర్గానికి సహకరిస్తున్నానని ఆరణి ఆరోపిస్తున్నారని...అయితే అది పూర్తి అవాస్తవమన్నారు. జగన్‌ సీఎం కావాలనే ఆకాంక్షతోనే పార్టీలో అన్ని అవమానాలనూ భరిస్తున్నానని చెప్పారు.పార్టీ అధిష్ఠానం దృష్టికి సమస్యను తీసుకువెళ్లేందుకే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ అందరినీ సమన్వయం చేసుకుని వెళితేనే వైసీపీ గెలుపు సాధ్యమవుతుందని ఆమె సూచించారు.