15వేల కెమెరాలతో 43 వేల మందిపై నిఘా

Published: Monday February 18, 2019
ఏపీ పోలీసు రికార్డుల్లో నేరస్థుడిగా ముద్రపడినవారు.. ఇకపై ఎక్కడికి వెళ్లినా పోలీసుల నిఘానేత్రం నుంచి తప్పించుకోలేరు!. బస్టాండుకు వెళ్లినా, విమానాశ్రయానికి వెళ్లినా.. అక్కడ కెమెరా కన్ను వీరిని గమనిస్తూనే ఉంటుంది! ఔను.. నేరస్థుల పాలిట సింహాల్లా.. ఏపీ పోలీసులు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో బుల్లెట్‌లా దూసుకుపోతున్నారు. నేరస్థులపై మూడో కన్ను గురిపెట్టి డేగల్లా వేటాడేందుకు సిద్ధమవుతున్నారు. à°† టెక్నాలజీ ఏంటో చూద్దాం..!
 
సుమారు ఐదుకోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రంలో ఏటా లక్షకుపైగా కేసులు నమోదవుతున్నాయి. వాటిలో 20శాతం కేసుల్లో పాత నేరస్థుల ప్రమేయమే ఉంటోంది. దీంతో వారిపై రౌడీ, కేడీ ఇలా హిస్టరీ షీట్లు నమోదవుతున్నాయి. రౌడీలు, దొంగలు, స్మగ్లర్లు, భూకబ్జాదారులు, సైబర్‌ నేరగాళ్లు ఇలా ఎవరైనా సరే.. à°’à°•à°Ÿà°¿ రెండు నేరాలు చేస్తే షీట్లు నమోదు చేయడం పోలీసుల విధి. ఏటా జనాభాతోపాటు నేరాలు కూడా కొంతమేరకు పెరుగుతుంటాయి. అయితే ఏపీలో à°—à°¤ ఏడాది చేపట్టిన à°•à° à°¿à°¨ చర్యల వల్ల నేరాల శాతం కొంతమేర తగ్గింది. డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ మరో అడుగు ముందుకేసి టెక్నాలజీని మరింత విరివిగా వినియోగించాలని నిర్ణయించారు. పోలీసు రికార్డుల్లో ఉన్న క్రిమినల్‌ డేటాబే్‌సను సీసీ కెమెరాలతో అనుసంధానం చేసి నేరస్థులపై నిఘా పెడితే రిపీట్‌ అఫెండర్స్‌ను అదుపు చేయవచ్చని నమ్ముతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18 పోలీసు యూనిట్లు ఉండగా సుమారు 15 వేల కెమెరాలు ఎన్నికల్లోపు ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే సగానికిపైగా పూర్తయ్యాయి. à°ˆ కెమెరాలన్నింటికీ పోలీసు స్టేషన్లలో ఉన్న నేరస్థుల ఫొటోలు అనుసంధానిస్తారు. 2018 నవంబరు నాటికి ఏపీలోని 13 జిల్లాల్లో 42,769మంది వివిధ రకాల షీటర్లు పోలీసు రికార్డుల్లో ఉన్నారు. వీరితోపాటు ఎన్నికల నేపథ్యంలో మరికొందరిపై నిఘా ఉంచి మరిన్ని షీట్లు నమోదు చేయబోతున్నట్లు సమాచారం.
 
అన్ని కెమెరాల ద్వారా హిస్టరీ షీటర్లపై నిఘా పెట్టడం వల్ల.. వాటి పరిధిలోకి షీటర్‌ రాగానే సంబంధిత జిల్లా పోలీసు కంట్రోల్‌ రూమ్‌లో రెడ్‌సిగ్నల్‌ వస్తుంది. అక్కడ నిరంతరం పర్యవేక్షించే పోలీసులు క్లిక్‌ చేయగానే మీ జిల్లాలోని ఫలానా పోలీసు స్టేషన్లోని హిస్టరీ షీటర్‌ మరో జిల్లాలోని బ్యాంకులోకి ప్రవేశించాడని చూపుతుంది. ఇదే సమాచారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం టెక్‌టవర్‌కు కూడా తెలియజేస్తుంది. పోలీసులు అప్రమత్తమై అతడిపై అనుమానం వస్తే అదుపులోకి తీసుకుని విచారిస్తారు. కారణం సహేతుకంగా లేదంటే కటకటాల్లోకి నెడతారు.