వైసీపీపై మంత్రి లోకేశ్‌ ధ్వజం

Published: Wednesday February 20, 2019

‘‘వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన రైతు ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు ఎంతగానో శ్రమించారు. వారిపైనే నిందలేసి శవ రాజకీయాలు చేయడం దారుణం’’ అని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. గుంటూరు జిల్లాలోని కొండవీడులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన రైతు కోటయ్య మృతి రాజకీయ రంగు పులుముకోవడంతో లోకేశ్‌ ట్విట్టర్‌లో స్పందించారు. ‘‘తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని సీఎం పదవి కోసం శవ రాజకీయాలు చేశారు. చావుదెబ్బ తిన్నా ఇంకా జగన్‌కు బుద్ధి రాలేదు. రైతు పొలానికి, ముఖ్యమంత్రి హెలీప్యాడ్‌కు ఏ మాత్రం సంబంధం లేదు. అయినా తన దొంగ పత్రికలో, దొంగ రాతలతో శవాన్ని అడ్డం పెట్టుకుని కుల రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు పొలానికి 500 మీటర్ల దూరంలో సీఎం హెలీప్యాడ్‌ ఉంది. (à°† ఫోటోను లోకేశ్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.) పురుగు మందు తాగి పొలంలో పడి ఉన్న రైతు ప్రాణం కాపాడేందుకు ఆయనను మోసుకొంటూ పోలీసులు పరిగెట్టారు. (à°† వీడియోనూ ఆయన తన ట్వీట్‌కు జత చేశారు.) రైతు వ్యక్తిగత కారణాలతో చనిపోతే, ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించకుండా రైతు మృతినీ రాజకీయంగా వాడుకోవడమేనా మీ అజెండా?’’ అని లోకేశ్‌ మండిపడ్డారు.