కర్నూలు విద్యార్థుల భేటీలో పవన్‌ కళ్యాణ్‌

Published: Tuesday February 26, 2019
రాయలసీమ వెనుకబాటుతనానికి ఇక్కడి నాయకుల తప్పిదాలే కారణమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం కర్నూలులోని యుబీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డిని ఒక్కమాటంటే ఆయన ఇతర నాయకులతో నన్ను తిట్టిస్తారు. సీమ వాసిగా ఆయకు రాయలసీమపై ప్రేమ ఉంటే సమస్యలపై ఎందుకు పోరాటం చేయడం లేదు? ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభలకు వెళ్లకుండా పర్సనల్‌ గేమ్‌à°—à°¾ తీసుకుంటే ఎలా..? మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలు.
 
వారి సమస్యలపై ప్రభుత్వాలను నిలదీయాల్సిన మీరు. చట్టసభలకు ఎందుకు వెళ్లరు? ప్రతిపక్ష నేతగా మీరేం చేస్తున్నారు? ప్రజల పక్షాన లేరు.. ఓటర్లుగా ప్రజలను వాడుకుంటున్నారే తప్ప వారికి à°…à°‚à°¡à°—à°¾ ఉండడం లేదు’ అని దుయ్యబట్టారు. జనసేన ప్రభుత్వం వస్తే ఎల్కేజీ నుంచి ఇంటర్‌ వరకు ఉచిత విద్య అందిస్తామని, మండలాకో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాజకీయ నాయకులకే కాలేజీలు ఉన్నాయని, వాటి కోసం ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేశారని, ఇలాంటి విధానాన్ని ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం మార్చి చూపించిందని అన్నారు.
 
మన భయమే రౌడీలు, గూండాలకు బలమని, ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు పవన్‌ సూచించారు. ‘నాకు అధికారం అంతిమ లక్ష్యం కాదు. ఎన్నికలకు ఎన్ని వేల కోట్లు కావాలో తెలియదు. వీధివీధినా గూండాలు రాజ్యమేలుతున్న ఉత్తరప్రదేశ్‌లో లారీటైర్లను కాలికి చెప్పులుగా ధరించి ముందుకుసాగిన కాన్షీరాం స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. మా తాతలు, తండ్రులు సీఎంలు కాదు. అన్నయ్య ప్రజలకు ఏదో చేద్దామని వస్తే దెబ్బకొట్టి పంపారు.