తీరంలో సరికొత్త ఇం‘ధనం’!

Published: Thursday February 28, 2019
 à°•à±ƒà°·à±à°£à°¾-గోదావరి బేసిన్‌లో అపార సహజ వాయువు, చమురు నిక్షేపాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్‌ తరాలకు అవసమైన సరికొత్త ఇంధన వనరులు à°ˆ ప్రాంతంలోని సముద్ర భూగర్భంలో ఉన్నట్లు తాజా పరిశోధనలో గుర్తించారు. అదే ‘మిథేన్‌ హైడ్రేట్‌’!. అదీ మామూలుగా కాదు.. భారత జలాల్లో లక్షల క్యూబిక్‌ మీటర్ల మిథేన్‌ గ్యాస్‌ నిక్షేపాలు హైడ్రేట్‌ రూపంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. à°ˆ గ్యాస్‌ హైడ్రేట్స్‌ భవిష్యత్‌లో భారత్‌కు ఇంధన వనరుగా మారబోతున్నట్లు చెబుతున్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌ కేజీ బేసిన్‌లోని బంగాళాఖాతం సముద్రం అడుగుభాగం నుంచి కేవలం రెండు మీటర్ల లోతులోనే మిథేన్‌ హైడ్రేట్స్‌ ఉన్నట్లు గుర్తించారు. గోవాకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ, హైదరాబాద్‌కు చెందిన నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన శాస్త్రవేత్తల బృందం à°ˆ ప్రాంతంలో నిర్వహించిన అధ్యయనంలో ఇది బయటపడింది. à°ˆ వివరాలను ఎర్త్‌ సిస్టమ్‌ సైన్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. ‘భారత విశిష్ఠ ఎకనామిక్‌ జోన్‌లో చైతన్యమంతమైన మిథేన్‌ ప్రవహాన్ని గుర్తించి, మిథేన్‌ హైడ్రేట్‌ నిక్షేపాలు à°Žà°‚à°¤ లోతులో ఉన్నాయో తెలుసుకుని విడుదల చేసిన మొదటి నివేదిక ఇదే’ అని పేర్కొన్నారు.