వైసీపీ, టీడీపీలతో పొత్తు ఉండదు: పవన్‌

Published: Friday March 01, 2019
 à°²à°•à±à°· కోట్ల దోపిడీ కాదు.. జనసేన అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ చెప్పారు. ప్రజాపోరాటయాత్ర బహిరంగ సభను గురువారం à°•à°¡à°ª జిల్లా రైల్వేకోడూరులోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద నిర్వహించారు. రాయలసీమ నుంచి ఎంతో మంది నాయకులు వచ్చి దౌర్జన్యాలు, భూకబ్జాలు చేశారని ఆరోపించారు. ‘డబ్బు సంపాదించాలని రాజకీయాల్లోకి రాలేదు. జగన్‌ మాదిరిగా నవరత్నాలు చెప్పలేదు. లక్షల కోట్లు ఇస్తామని చెప్పలేదు. మేం అధికారంలోకి వస్తే ప్రజలకు, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు à°…à°‚à°¡à°—à°¾ నిలుస్తాం.
 
నందలూరులో ఆల్విన్‌ పరిశ్రమను పునరుద్ధరిస్తాం’ అన్నారు. జనసేన, టీడీపీ కుమ్మక్కవుతున్నాయని వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారని, విజయనగరం వెళ్లి బొత్స సంగతి తేలుస్తానని హెచ్చరించారు. వైసీపీ, టీడీపీలతో పొత్తులు పెట్టుకునే ప్రసక్తే ఉండదన్నారు. ప్రజల అండతో ముఖ్యమంత్రి అవుతానన్నారు. రాయలసీమలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని చెప్పారు. యుద్ధం ఎవరికీ మంచిది కాదన్నారు. ‘‘యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదు. యుద్ధమంటూ జరిగితే రెండు దేశాలూ నష్టపోతాయి’’ అని పేర్కొన్నారు.