ఒడిశా సీఎం విజ్ఞప్తి మేరకే

Published: Saturday March 02, 2019
 à°µà°¿à°¶à°¾à°–పట్నం కేంద్రంగా ఏర్సాటు చేసిన కొత్త రైల్వే జోన్‌ మాయగా ఉందని, వాల్తేర్‌ డివిజన్‌ను రద్దు చేయడమేమిటని రాష్ట్రప్రభుత్వం చేస్తున్న విమర్శలపై రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎప్పుడూ అసంతృప్తితోనే ఉంటుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఢిల్లీ రైల్‌ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం ఉద్దేశాలను రాష్ట్రప్రభుత్వం సందేహిస్తోందని అనగా.. ‘వాళ్ల ఉద్దేశాలను నేనూ సందేహిస్తున్నాను. రైల్వే జోన్‌ కావాలని చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. à°—à°¤ వారం ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి లేఖ కూడా వచ్చింది. సందేహాలపై ఆయన్ను మీరే ప్రశ్నించాలి. రాజకీయాలు కావాలో, రాష్ట్ర ప్రజల సంక్షేమం కావాలో à°…à°¡à°—à°‚à°¡à°¿’ అని బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అసంతృప్తిని ప్రస్తావించగా.. ‘à°† ప్రభుత్వం ఎప్పుడూ అసంతృప్తితోనే ఉంటుంది. అందుకు ఇతర కారణాలు ఉన్నాయి. వాళ్లు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించరు. రాయగఢ కేంద్రంగా కొత్తగా రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయాలని ఒడిశా ముఖ్యమంత్రి నాకు లేఖ రాశారు. à°† మేరకు రాయగఢ రైల్వే డివిజన్‌ను ప్రకటించాం’ అని తెలిపారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో గోయల్‌ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘మేం రైల్వే జోన్‌ను ప్రకటిస్తున్నామని తెలిసి ముందుగానే చంద్రబాబు నాకు లేఖ రాశారు. à°ˆ దఫా టీడీపీకి 2 లోక్‌సభ స్థానాలు కూడా రావు’ అని అన్నారు.