విశ్లేషకుల అంచనాలనే చెప్పాను

Published: Sunday March 03, 2019
‘ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని నాకు రెండేళ్ల కిందటే చెప్పారు’ అని చేసిన వ్యాఖ్యలపై జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ వివరణ ఇచ్చారు. ఇది తనకు ఎవరో చెప్పింది కాదని... ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, వార్తా చానళ్లకు తెలిసిందే తాను చెప్పానని వివరించారు. పాక్‌లో భారత్‌ వైమానిక దాడులు జరిపిన రోజునే (గతనెల 26à°¨) కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పవన్‌ ‘యుద్ధం’ గురించి ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో వివాదాస్పదమయ్యాయి. తమ దేశ వాదనను బలపరుచుకునే క్రమంలో పాక్‌ మీడియా కూడా దీనికి ప్రాధాన్యమిచ్చింది.
 
 
à°ˆ క్రమంలో విద్యార్థులు, యువతతో మాట్లాడుతూ పవన్‌ దీనిపై వివరణ ఇచ్చారు. ‘‘యుద్ధం వస్తుందని నాకేం తెలుసు! రెండేళ్ల ముందే నేనెలా చెప్పలగలను? పాకిస్థాన్‌ వాళ్లు మాట్లాడుకునేది వింటానా ఏంటి? లేమ్యాన్‌ బ్రదర్స్‌ సంస్థ ఆర్థికంగా కుప్పకూలుతుందని ముందునుంచే అంచనావేసి చెప్పేవారు. అలాగే యుద్ధం వస్తుందని ఊహించేందుకు కొందరి వ్యాఖ్యలే కారణం. నేనూ వాటిని దృష్టిలో ఉంచుకుని చెప్పాను’’ అని పవన్‌ వివరించారు.