ముస్లింలకు మేలు చేసింది ఎన్టీఆర్‌, చంద్రబాబే

Published: Thursday March 07, 2019
 à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à±‌, చంద్రబాబు పాలనలోనే ముస్లింలకు మేలు జరిగిందని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. మైనారిటీ కార్పొరేషన్‌, షాదీఖానాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు ఎన్టీఆర్‌.. హైదరాబాద్‌లో హజ్‌హౌ్‌సకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని అన్నారు. à°•à°¡à°ª శివారు రూ.27కోట్లతో నిర్మించిన రాష్ట్రంలోని మొదటి హజ్‌హౌ్‌సను మంత్రులు ఆదినారాయణరెడ్డి, ఫరూక్‌, శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌ బుధవారం ప్రారంభించారు. à°ˆ సందర్భంగా మంత్రి ఫరూక్‌ మాట్లాడుతూ.. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల సౌకర్యార్థం కడపలో హజ్‌హౌస్‌ నిర్మించామన్నారు. ‘రాష్ట్రం నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే వారిలో 70ు à°•à°¡à°ª జిల్లా నుంచే వెళ్తారు.
 
షాదిఖానాలతోపాటు పలుసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముస్లింలకు చంద్రబాబు à°…à°‚à°¡à°—à°¾ నిలిచారు. à°ˆ విషయాన్ని ముస్లింలంతా గుర్తు పెట్టుకోవాలి. పొరపాటున జగన్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో వైఎస్‌ మతకల్లోలాలతో మారణహోమం సృష్టించారు. à°ˆ విషయాన్ని అప్పట్లో చెన్నారెడ్డి శాసనసభలో వెల్లడించారు. ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డిపై ప్రధానమంత్రి సమక్షంలోనే కడపలో వైఎస్‌ చెప్పులేయించారు. అలాంటి జీన్స్‌ ఉన్న జగన్‌కు ఓటేస్తే ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవాలి’ అని ముస్లింలను హెచ్చరించారు.
 
ప్రశాంతంగా జీవిస్తున్న హిందు, ముస్లింల మధ్య చిచ్చుపెట్టేందుకు అసదుద్దీన్‌ ఒవైసీ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘మజ్లిస్‌ పార్టీ వారు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు. à°—à°¤ ంలో నంద్యాల, కర్నూలు ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయో గుర్తుకు తెచ్చుకోవాలి. ఒవైసీపై నేనేపోటీ చేస్తాను. రాష్ట్రంలో ఓట్లు తొలగించే కార్యకమ్రానికి తెరలేపారు. నా ఓటు మినహా నా కుటుంబసభ్యుల ఓట్లు తొలగించారు. కృష్ణా జలాలు రాయలసీమకు వచ్చాయంటే అది ఎన్టీఆర్‌, చంద్రబాబు వల్లనే సాధ్యమైంది’ అని ఫరూక్‌ అన్నారు. మరో మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ.. జగన్‌ మీడియాపై విమర్శలు గుప్పించారు. ‘పసుపు కుంకుమ à°•à°¿à°‚à°¦ ఇచ్చిన చెక్కులు చెల్లితే ఎక్కడ జనం చెక్కుతారోనన్న భయం వైసీపీలో ఉంది. ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పడంతోనే టీడీపీ ఓట్లు తొలగించే కార్యక్రమానికి వైసీపీ ఒడిగట్టింది’ అని ఆది అన్నారు. శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ తర్వాత కడపలో హజ్‌హౌస్‌ కట్టిన ఘటన సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అమరావతిలో కూడా నిర్మిస్తున్నారని చెప్పారు.