దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి ...కలిశారు

Published: Thursday March 14, 2019
మూడు దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి వారిద్దరూ కలిసిపోయారు. 2 వర్గాలను ఏకం చేసి à°°à°¾ నున్న ఎన్నికల్లో విజయం సాధించే ప్రయత్నానికి నాంది పలికారు. రాష్ట్ర మంత్రి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి కుటుంబాల నడుమ దశాబ్దాలుగా వైరం ఉన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం వరకు à°ˆ వర్గాలు వేర్వేరు పార్టీల్లో ఉండేవి. వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో విభేదించి ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరారు. అయినా ఉభయ వర్గాలూ కలవలేకపోయాయి. సీఎం చంద్రబాబు వీరిద్దరినీ సమాధానపరచి.. à°ˆ ఎన్నికల్లో à°•à°¡à°ª లోక్‌సభ స్థానంలో ఆదినారాయణరెడ్డిని, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంలో రామసుబ్బారెడ్డిని బరిలోకి దించారు.
 
 
అయితే నేతలు కలిసినా.. అనుచరులు విభేదాలు మరచి కలిసి నడుస్తారా అన్న సందేహం ఉండేది. à°† అనుమానాలను రెండు వర్గాలూ పటాపంచలు చేశాయి. జమ్మలమడుగులో బుధవారం నిర్వహించిన ‘ఆత్మీయ సమ్మేళనా’నికి ఇరు వర్గాల జనప్రవాహం కదిలి వచ్చింది. వీరి కలయికపై రెండు వర్గాల నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఆది, రామసుబ్బారెడ్డి కలయికతో ఈసారి à°•à°¡à°ª లోక్‌సభ స్థానాన్ని, జమ్మలమడుగు అసెంబ్లీ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు.
 
రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్యేగా, మంత్రి ఆది లోక్‌సభకు పోటీచేసేలా ఒప్పించారు. à°—à°¤ నెలలోనే టికెట్‌ ఖరారు చేసి ప్రచారం మొదలుపెట్టాలని సూచించినా.. ఎన్నో ఏళ్ల వైరాన్ని మనసులో పెట్టుకున్న వారి అనుచరులు.. కలిసేది లేదని భీష్మించుకున్నారు. మంత్రి ఆది, రామసుబ్బారెడ్డి తమ తమ వర్గాలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే బుధవారం జమ్మలమడుగులో ఇద్దరూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. భారీ ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గంలోని రెండు వర్గాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో జన ప్రవాహంగా మారింది.