ఇన్‌చార్జులను కాదని కొత్తవారికి సీట్లు

Published: Monday March 18, 2019
ఒకేసారి మొత్తం అభ్యర్థులను ప్రకటించిన వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిశాయి. అభ్యర్థుల జాబితా చూశాక పలు జిల్లాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న నియోజకవర్గ సమన్వయకర్తలను పక్కనపెట్టి రాత్రికిరాత్రి పార్టీ మారినవారికి టికెట్లు ఇవ్వడంపై నేతలు, వారి అనుచరగణం మండిపడుతున్నారు. పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్నవారిని అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నట్టేట ముంచారని పలువురు మండిపడుతున్నారు. టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్ల ముందు ధర్నాలకు దిగుతున్నారు. ఆందోళనల తీవ్రత ఎక్కువగా విశాఖ జిల్లాలో ఉంది. ఇక్కడ ఎంపీ అభ్యర్థి కార్యాలయాన్ని ధ్వంసం కూడా చేశారు. విశాఖ తూర్పులో సీనియర్‌ నేత వంశీకృష్ణ శ్రీనివా్‌సను కాదని.. విజయనిర్మలకు టికెట్‌ అసంతృప్తి భగ్గుమంది.
 
ఆయన అనుచరులు విధ్వంసం సృష్టించారు. ఎంవీపీ కాలనీలో à°—à°² ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయానికి చేరుకుని జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతమంది కార్యాలయంలోని ఫర్నీచర్‌, అద్దాలు, టీవీ, ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. అనంతరం అక్కడ నుంచి మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. లోపలకు వెళ్లేందుకు యత్నించినప్పటికీ తలుపులు తెరుచుకోకపోవడంతో బయటే ఆందోళన నిర్వహించారు. కార్యాలయం బయట ఉన్న ఫ్లెక్సీలు, పూల కుండీలను ధ్వంసం చేశారు. అనంతరం భీమిలి వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మళ్ల విజయప్రసాద్‌ ఇళ్ల వద్ద కూడా ఆందోళన నిర్వహించారు. విశాఖ జిల్లాలో పార్టీ జెండా పట్టిన మొట్టమొదటి నాయకుడు వంశీకృష్ణ అని, అటువంటి వ్యక్తికి నేడు గౌరవం లేకపోవడం దారుణమని.. జగన్‌ రూ.కోట్లు కుమ్మరించేవాళ్లకి టికెట్లు ఇస్తున్నారే తప్ప ప్రజా నాయకులకు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
 
ముత్తంశెట్టి శ్రీనివాసరావు వల్లే తమ నేతకు టికెట్‌ నిరాకరించారని ఆరోపించారు. 24 గంటల్లో వంశీకి బీ ఫారం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, పార్టీ నుంచి ఎవరు బరిలో దిగినా ఓడిస్తామని హెచ్చరించారు. యలమంచిలి టికెట్‌ కన్నబాబురాజుకు ఇవ్వడంతో మాజీ సమన్వయకర్తలు ప్రగడ నాగేశ్వరరావు, బొడ్డేడ ప్రసాద్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏ పార్టీలో చేరేదీ రెండు రోజుల్లో వెల్లడిస్తామన్నారు. విజయసాయిరెడ్డి పెద్దమొత్తంలో డబ్బు తీసుకుని కన్నబాబురాజుకు టిక్కెట్‌ ఇచ్చారని ప్రగడ నాగేశ్వరరావు ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కన్నబాబురాజును à°“à°¡à°¿à°‚à°šà°¿ తమ సత్తా ఏమిటో చూపిస్తామని ప్రసాద్‌ అన్నారు. వైసీపీ కండువా కప్పుకొని 24 గంటలైనా గడవకముందే విశాఖ దక్షిణ స్థానాన్ని ద్రోణంరాజు శ్రీనివా్‌సకు కేటాయించడంపై à°† నియోజకవర్గ వైసీపీ నేతల్లో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ప్రస్తుత సమన్వయకర్త డాక్టర్‌ రమణమూర్తి, మాజీ ఇన్‌చార్జి కోలా గురువులు వేర్వేరుగా తమ అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీలో కొనసాగాలా.. మారాలా.. లేక రెబెల్‌à°—à°¾ బరిలో దిగాలా అన్న అంశాలపై చర్చించారు.