తమ పార్టీకే ఓటేయాలంటూ ఒత్తిడి

Published: Wednesday March 20, 2019
ఇంట్లో ఉన్నందుకు అద్దె చెల్లిస్తున్నారు! వారి బతుకేదో వారు బతుకుతున్నారు! కానీ... వారి బతుకుపైనా, భవిష్యత్తుపైనా సర్వాధి కారాలూ తనవే à°… న్నట్లుగా à°† ఇంటి à°¯ జమాని వ్యవహరించా రు. ‘మా ఇంట్లో అద్దెకు ఉంటున్నారు! మేం చెప్పిన పార్టీకే ఓటు వేయాలి’ అని ఒత్తిడి తెచ్చారు. ‘మా ఓటు.. మా ఇష్టం’ అని చెప్పినందుకు... వృద్ధులనే కనికరం కూడా లేకుండా అర్ధరాత్రి ఇంటిని నుంచి వెళ్లగొట్టారు. గుంటూరుజిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురంలో à°ˆ ఘటన జరిగింది. à°ˆ గ్రామానికి చెందిన భీమినేని అంకమరావు(70), మహాలక్ష్మమ్మ (65) దంపతులు చెరుకుమల్లి బుజ్జి అనే స్థానిక వైసీపీ నేత ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
 
‘మా పార్టీకే ఓటు వేయండి’ అని à°† దంపతులను బుజ్జి పలుమార్లు అడిగారు. ‘చంద్రబాబు వల్ల మాకు నెలకు 2వేల పింఛను వస్తోంది. మగపిల్లలు లేకపోయినా ఆయనే పెద్దకొడుకులా ఆదుకుంటున్నారు. మా ఓటు ఆయనకే వేస్తాం’ అని వాళ్లు చెబుతూ వచ్చారు. సోమవారం రాత్రి బుజ్జి వారితో వాదనకు దిగారు. ‘వైసీపీకి ఓటు వేస్తామని మాట ఇవ్వండి’ అని పట్టుబట్టారు. వృద్ధ దంపతులు అంగీకరించలేదు. ‘ఐతే బయటికి నడవండి’ అంటూ వారిచేత బుజ్జి ఇంటిని ఖాళీ చేయించారు. చేసే దేమీలేక అంకమరావు దంపతులు అర్ధరాత్రి చిన్న బడ్డీ కొట్టులోకి సామాన్లు మార్చుకున్నారు. రాత్రికి అక్కడే తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు.. వారికి చిన్న గదిలో ఆవాసం ఏర్పాటు చేశారు.