ప్రజా సమస్యలు తీర్చేవాడే నాయకుడు... సీఎం అయితే చేస్తాననేవారు కాదు

Published: Wednesday March 27, 2019
 ‘‘నిజమైన నాయకుడంటే ప్రజా సమస్యలు తీర్చేవాడు.. అంతేగానీ ‘నన్ను సీఎం చేయండి.. మీ సమస్యలు పరిష్కరిస్తాను’ అనే వారు కాదు’’ అని జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ జగన్‌ను ఎద్దేవా చేశారు. ‘‘వారు ఎమ్మెల్యేలా? లేక బెట్టింగ్‌ మాస్టర్లా?’ అంటూ నెల్లూరు సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన నెల్లూరులో పర్యటించారు. ‘‘ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి ప్రజలు ఏ సమస్య తీసుకొచ్చినా, నేను సీఎం అయితే అన్నీ చేస్తానని అంటున్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్థులు సమస్యలపై నా దగ్గరకు వస్తే నేను ప్రెస్‌మీట్‌ పెట్టా. వెంటనే విద్యాశాఖ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు స్వయంగా నెల్లూరుకు వచ్చి విద్యార్థుల సమస్యను తీర్చారు. అదే విద్యార్థులు జగన్‌ వద్దకు వెళ్లి ఉంటే నన్ను సీఎం చేయండి.. సమస్య తీరుస్తాననేవారు’’ అని విమర్శించారు. రాజకీయం అంటే బెట్టింగ్‌ అయిపోయిందంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై పవన్‌ మండిపడ్డారు.
 
‘‘నెల్లూరు సిటీ, రూరల్‌లో గెలిచినవారు ఎమ్మెల్యేలా? లేక బెట్టింగ్‌ మాస్టర్లా? జూదగాళ్లకు చట్టసభలు ఎందుకు? జూదం ఆడుకోవచ్చుగా’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. à°ˆ జూదగాళ్లను ఒకసారి గెలిపిస్తేనే పోలీసు స్టేషన్లకు వెళ్లి పోలీసులనే బెదిరించారని, మరోసారి వారు గెలిచి అధికారంలోకొస్తే నేరుగా ప్రజల ఇళ్లకే వెళ్లి చొక్కాలు పట్టుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. జగన్‌ బాటలోనే ఆయన ఎమ్మెల్యేలు కూడా నడుస్తున్నారని పవన్‌ విమర్శించారు. ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలో ముందు వారు నేర్చుకోవాలని హితవు పలికారు.