సీమలో వారసత్వ రాజకీయాలకు చరమగీతం!

Published: Friday March 29, 2019
ఏపీ రాజధాని అమరావతిపై జనసేన జెండా ఎగురవేద్దామని à°† పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. అందుకు జనసైనికులంతా తనకు à°…à°‚à°¡à°—à°¾ ఉండాలని కోరారు. తనకు à°…à°‚à°¡à°¾..దండా జనసైనికులే తప్ప మరెవరూ లేరన్నారు. గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గం, అనంతపురం జిల్లా ధర్మవరం, అనంతపురం అర్బన్‌ నియోజకవర్గాలు, à°•à°¡à°ª నగరంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ ‘సైకిల్‌ పాతబడిపోయింది. సైకిల్‌ చైన్‌ను కేసీఆర్‌ తెంపేశారు. చైన్‌కు అతుకులేసుకొని తిరుగుతున్నారు. ఎండవేడికి ఫ్యాన్‌ తిరగడం లేదు. గాజు గ్లాసుతో మంచినీళ్లు, మజ్జిగ ఇచ్చి ప్రజలను సేదతీరుద్దాం. జగన్‌లాగా నేను ముఖ్యమంత్రి కుమారుడిని కాదు. చంద్రబాబులాగా సీఎం అల్లుడ్నీ కాదు.
 
 à°¸à°¾à°®à°¾à°¨à±à°¯ కానిస్టేబుల్‌ కొడుకుని. రాయలసీమలో వారసత్వ, కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలి. కోట్ల రూపాయల సంపాదన, బిడ్డల భవిష్యత్తు వదులుకుని, ప్రజల భవిష్యత్తు కోసం, ముఖ్యంగా రాజకీయాల్లో మార్పుకోసం వచ్చాను’ అన్నారు. జనసేనకు ఒక్కసారి అవకాశం ఇవ్వండని అభ్యర్థించారు. సరికొత్త ప్రజాప్రతినిధులను ఎన్నుకోండని కోరారు. జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్షనిజాన్ని పాతిపెడతానని ప్రకటించారు. ముస్లింలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చెందాలని, వారి జీవన విధానంలో మార్పురావాలని ఆకాంక్షించారు. అది జనసేనతోనే సాధ్యమని చెప్పారు. ‘ప్రతిపక్షం విమర్శిస్తున్నట్టు టీడీపీతో జతకట్టాలంటే ధైర్యంగా చేస్తా. అది కూడా చెప్పి చేస్తా. 2014 ఎన్నికల్లో జతకట్టాను గెలిపించాను. తర్వాత à°† పార్టీ ప్రజలకు చెప్పినట్లు చేయలేదు. అందుకే బయటకు వచ్చా. సీపీఐ, సీపీఎం, బీఎస్పీతో మాత్రమే పొత్తుపెట్టుకున్నా. మిగిలిన ఏ పార్టీతోనూ మాకు సంబంధం లేదు’ అన్నారు. వైసీపీని ఎదుర్కొనే సత్తా టీడీపీకి లేదని, అది తనకే సాధ్యమని చెప్పారు.
 
‘తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిస్తే టీడీపీ రాజకీయం చేస్తోంది. మరోవైపు టీడీపీకి సపోర్టర్‌నంటూ వైసీపీ విమర్శలు చేస్తోంది. నేనెవరికీ సపోర్టర్‌ను కాదు. ప్రధాని మోదీ, కేసీఆర్‌à°² పార్ట్‌నర్‌ జగనే’ అన్నారు. ఏ పదవినీ ఆశించకుండా పదేళ్లు రాజకీయం చేశానని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. సీమలో వలసల నివారణకు సౌభాగ్య రాయలసీమ పథకం అమలు చేసి రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు. సీమను రాయలేలిన సీమగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. జైలు నుంచి వచ్చి నీతివంతమైన రాజకీయాలంటూ బీరాలు పలుకుతున్న జగనే అసలైన యాక్టర్‌ అని, మోదీ, అమిత్‌à°·à°¾, కేసీఆర్‌లకు జగన్‌ నిజమైన పార్టనర్‌ అని పవన్‌ మండిపడ్డారు. ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవాలంటే దొరలా బహిరంగంగా చెబుతానని.. జగన్‌లా దొంగాట ఆడనని ఎద్దేవా చేశారు.
 
అనంతపురం నుంచి కడపకు వచ్చేందుకు బయలుదేరగానే ఢిల్లీ నుంచి తన హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించారని, ఇది కచ్ఛితంగా కేంద్రం కుట్రేనన్నారు. జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా ఆరోపణలకు కనీసం వివరణ కూడా ఇవ్వలేని స్థితిలో జగన్‌ ఉన్నారన్నారు. సినిమా నటున్నేనని గర్వంగా గౌరవంగా చెప్పుకోగలనని, జైలు నుంచి వచ్చిన జగన్‌ ఏమని బదులిస్తారో చెప్పాలన్నారు. అనంతపురంలో తన ఎన్నికల సభావేదికను టీడీపీ వారు కూల్చివేశారని, అటువంటివారితో తాము పొత్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు