అవును.. అప్పుడు నేను యాక్టర్‌నే

Published: Saturday March 30, 2019
‘‘రాజకీయాల్లోకి రాక ముందు నేను యాక్టర్‌నే. కానీ పాదయాత్ర చేయక ముందు జగన్‌ ఎక్కడున్నారు? రెండేళ్లు జైల్లో గడిపిన జగన్‌నేమనాలి?’’ అని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ధ్వజమెత్తారు. ‘జగన్‌ ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి’ అని హెచ్చరించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు, నంద్యాల, ఆదోనిలో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. కొణిదెలలో గ్రామస్థులతో మాట్లాడి.. à°† గ్రామాన్ని దత్తత తీసుకుంటానన్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తూ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఎదుటివారి గురించి మాట్లాడేముందు తాను ఎక్కడ ఉండేవాడో జగన్‌ గుర్తుపెట్టుకోవాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారనే బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చింది. ఇవ్వలేదు కనుక దూరంగా ఉంటున్నాం. మరి ఇప్పుడు మీ వైసీపీని అమిత్‌à°·à°¾, టీఆర్‌ఎ్‌సకు పార్టనర్‌ అనాలా? రాయలసీమలో పుట్టలేదుకానీ à°† పౌరుషం ఉన్నవాడిని. జాగ్రత్తగా ఆచితూచి నాతో మాట్లాడండి. నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేదిలేదు’’ అని జగన్‌ను హెచ్చరించారు.
 
12 ఏళ్ల క్రితం ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఏపీ ఎంతో అభివృద్ధి చెందేదని, రాష్ట్రంలో 60-40 కమీషన్ల పద్ధతి పోయేదని పవన్‌ అన్నారు. నిరుద్యోగంపై బలమైన యుద్ధం ప్రారంభిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక వ్యవసాయ మండలి పెట్టి లక్ష మంది యువ రైతులను తయారు చేస్తామన్నారు. రాయలసీమ వాటర్‌ కమిషన్‌ ఏర్పాటు చేసి.. సీఎంగా దానికి తానేచైర్మన్‌à°—à°¾ ఉండి నీటి సమస్యను రెండేళ్లలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జనసేన అధికారంలోకి వస్తే పదేళ్ల పాటు రాయలసీమను కరువు ప్రాంతంగా ప్రకటిస్తామని.. రూ.50 వేల కోట్లతో రాయలసీమ సౌభాగ్య పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. రైతులకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి రతనాల సీమగా మారుస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే జనసేన అధికారంలోకి రావాలని, ప్రజలందరూ డబ్బుకు అమ్ముడుపోని ఓట్ల వర్షాన్ని జనసేనపై కురిపించాలని అభ్యర్థించారు. సీమ అంటే వర్గాలు, కక్షలు, ఫ్యాక్షనిజం కాదని, తరిగొండ వెంగమాంబ, అన్నమయ్య వంటి మహానుభావులు నడయాడిన నేల అని గుర్తు చేశారు.
 
రాయలసీమ సంస్కృతి, భాష, మాండలికం, యాస, రచయితలను, కవులను పరిరక్షించుకునేందుకు రాయలసీమ కల్చరల్‌ అకాడమీ ఏర్పాటు చేస్తామన్నారు. నంద్యాల నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన ఎస్‌పీవైరెడ్డికి టీడీపీ టికెట్‌ ఇచ్చి à°…à°‚à°¡à°—à°¾ నిలవాల్సిన చంద్రబాబు.. ఆయనకు టికెట్‌ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇస్తాననడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ సీటును లోకేష్‌ దగ్గరే ఉంచుకుంటే మంగళగిరిలో పోటీ చేయనక్కర్లేదని పవన్‌కళ్యాణ్‌ ఎద్దేవా చేశారు. జనసేన మ్యానిఫెస్టోలో ప్రజాసంక్షేమ పథకాలకు పెద్దపీట వేశామన్నారు. ప్రతి ఆడపడుచుకూ ఏడాదికి 6 నుంచి 10 సిలిండర్లను ఉచితంగా అందజేస్తామన్నారు. రేషన్‌కు బదులుగా రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు మహిళల అకౌంట్‌కు నగదును బదిలీ చేస్తామని.. ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షల ఆరోగ్య బీమా, కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తామని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే 3 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.