ఓటమ్ముకోకన్నా...అలా చేస్తే సరుకు అమ్మను

Published: Sunday March 31, 2019
ఫోన్‌ కానాలంటేనే ఏ బ్రాండు మంచిది.. స్టార్‌ రేటింగ్‌ à°Žà°‚à°¤? ఆన్‌లైన్లో ఎంతుంది? మార్కెట్‌ ధర à°Žà°‚à°¤? ఇన్ని వివరాలు చూస్తాం! అన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాకే కొంటాం! అలాంటిది ఐదేళ్ల పాటు మనల్ని పరిపాలించే నాయకుల ఎంపికలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి! కానీ నచ్చినోడనే లేక ఎక్కువ డబ్బులిచ్చారనో.. à°’à°•à°°à°¿à°•à°¿ మనం ఓటేస్తే అది జీవితాన్నే అంధకారం చేసేస్తుంది. అయితే ఓటు హక్కు విలువను చాటిచెబుతూ.. ఓటర్లలో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టారో పెద్దాయన! తాను నష్టపోయినా ఫర్వాలేదు కానీ à°ˆ సమాజంలో ఒక్కరైనా మారితే చాలంటున్నారో పెద్దాయన! ఆయన పేరు వై.మురళీకృష్ణ. ‘‘ఓటును అమ్ముకునే à°“ ఓటరన్నా నీ దొంగ సొమ్ముకు నా షాపులో వస్తువులు అమ్మబడవు’’ అనే బ్యానర్‌తో à°ˆ చిరు వ్యాపారి అందరినీ ఆలోచింపజేస్తున్నారు.
 
గుడివాడలో à°’à°• ఎలక్ర్టానిక్‌ షాప్‌ నిర్వహిస్తున్నారు. 2014లో à°ˆ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన దశాబ్దాల తరబడి ఎలక్ర్టిక్‌ వ్యాపారం చేస్తున్నారు. ఆయనకు నెల మొత్తం కలిపితే 4 నుంచి 5 లక్షల వ్యాపారం జరగదు. కానీ ఎన్నికల ముగిసిన మూడు రోజుల్లో రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్య జరుగుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకూ వ్యాపారం జోరుగా ఉంటుంది. దీని వెనుక ఏముందో తెలుసుకోవాలని ఒకరిని ప్రశ్నించారు. తన ఇంట్లో నాలుగు ఓట్లున్నాయని, ఓటుకు రూ.2వేల చొప్పున.. ఇద్దరు అభ్యర్థులు రూ.20 వేలిచ్చారని à°† ఓటరు చెప్పాడు. à°† సొమ్ముతోనే రేడియో కొనేందుకు వచ్చానని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. అయితే ఓటును అమ్ముకోవడం తప్పుగా భావించని ఆయన.. à°† అమ్ముకున్న సొమ్ముతో వస్తువులు కొనుక్కోవడాన్ని వ్యతిరేకించారు. ‘ఓటమ్ముకున్న ఓటరుకు నా షాపులో వస్తు వులను అమ్మబోను’ అని బ్యానర్‌ను తయారుచేయించి దుకాణానికి పెట్టారు. ఫలితంగా మూడు రోజుల్లో వ్యాపారం రూ.లక్షన్నర దగ్గరే ఆగిపోయింది. అది కూడా à°“ బ్యానర్‌ చూసి నచ్చిన వాళ్లే కొనుగోలు చేయడం విశేషం. తాను నష్టపోయినా ఫర్వాలేదని.. కానీ తోటి ఓటరు ఓటు హక్కు విలువను తెలుసుకోవాలంతే అంటున్నారు మురళీకృష్ణ!! దేశవ్యాప్తంగా వేళ్లూనుకుపోయిన à°ˆ జాడ్యం.. దేశ పటం దిగువన ఉన్న à°“ చిన్న పట్టణంలో పెట్టిన బ్యానర్‌తో మారుద్దా!? అంటే బ్యానర్‌ కట్టడానికి వచ్చిన కూలీ మారినా తన ప్రయత్నం ఫలించినట్టేనంటున్నారు.