ప్రకటనలకు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే

Published: Tuesday April 09, 2019

రాష్ట్రంలో à°ˆ నెల 11à°µ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆఖరి దశ ప్రచారంలో భాగంగా à°† రోజు కానీ, ముందు రోజు(10à°µ తేదీ) కానీ అభ్యర్థులు, రాజకీయ పక్షాలు, ఇతరులు రాజకీయ ప్రకటనలు జారీ చేసే ముందు మీడియా సర్టిఫికేషన్‌ కమిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. à°ˆ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. తప్పుదోవ పట్టించే, రెచ్చగొట్టే, ద్వేషం రగిల్చే రాజకీ à°¯ ప్రకటనలతో మొత్తం ఎన్నికల వాతావరణం కలుషితం కావడంతో పాటు బాధితులు తిరిగి సమాధానం ఇచ్చుకునేందు కు తగిన సమయం ఉండని పరిస్థితి గతంలో జరిగిందని గుర్తు చేసింది. అలాంటివి పునరావృతం కాకూడదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం పంపిన à°“ లేఖలో ఆదేశించింది. అనుమతులకు సంబంధించిన నిర్ణయాల్లో జా ప్యం జరగకుండా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని మీడియా సర్టిఫికేషన్‌, మానిటరింగ్‌ కమిటీలను అప్రమత్తంగా ఉంచాలని సూచించింది. à°ˆ సమాచారాన్ని అన్ని రాజకీయ పార్టీ అధ్యక్షులకు, అభ్యర్థులకు, వ్యక్తులకు, వార్తా పత్రికల సంస్థలకు తెలపాలని, విస్తృత ప్రచారం కల్పించాలని, à°ˆ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది.