ఎలమంచిలిలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్యే ప్రధాన పోటీ

Published: Wednesday April 10, 2019
తెలుగుదేశం ఆవిర్భావం తరువాత à°† పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో ఎలమంచిలి కూడా à°’à°•à°Ÿà°¿à°—à°¾ నిలిచింది. 1983 నుంచి ఎనిమిది పర్యాయాలు ఎన్నికలు జరగ్గా ఆరుసార్లు టీడీపీ గెలిచింది. రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. à°—à°¤ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన పంచకర్ల రమేశ్‌బాబు.... వివాదాలకు దూరంగా ఉంటూ, అందరితో సఖ్యతతో మెలగుతూ ఐదేళ్ల కాలంలో కోట్లాది రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ‘పంచకర్ల రమేశ్‌బాబు స్థానికేతరుడు’ అన్న భావనను అచిరకాలంలోనే ప్రజల మదిలో నుంచి చెరిపేశారు. నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని సత్వర పరిష్కారానికి కృషి చేస్తూ వచ్చారు. సీనియర్‌ నేతలు పప్పల చలపతిరావు, లాలం భాస్కరరావు, లాలం భవానీతోపాటు ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రమాకుమారి, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనందకుమార్‌, తదితర నాయకులు à°…à°‚à°¡à°—à°¾ వున్నారు. à°—à°¤ ఐదేళ్లలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతృప్తిగా వున్నారని, పాడి రైతుల్లో మంచి పట్టున్న ఆడారి ఆనందకుమార్‌ ఎంపీ అభ్యర్థిగా వుండంతో ఈసారి కూడా టీడీపీదే విజయమని, పంచకర్ల మరోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
  
వైసీపీ అభ్యర్థి యూవీ రమణమూర్తిరాజు(కన్నబాబురాజు) 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. à°—à°¤ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ ఆశించారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో టిక్కెట్‌ ఇవ్వడం సాధ్యం కాదని అధిష్ఠానం సూత్రప్రాయంగా చెప్పడంతో వెంటనే వైసీపీలో చేరారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేగా వున్నప్పుడు చేసిన అభివృద్ధి, నియోజకవర్గంలో విస్తృతంగా వున్న పరిచయాలతో తన విజయం ఖాయమని కన్నబాబురాజు అంటున్నారు.
 
జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ సుమారు ఏడాది క్రితం వరకు తెలుగుదేశం పార్టీలో వున్నారు. à°—à°¤ ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ వస్తుందని ఆశించారు. అనూహ్యంగా పంచకర్ల ఇక్కడకు రావడంతో ఆయన ఆశలు నీరుగారాయి. ఈసారి కూడా తనవంతు ప్రయత్నాలు చేశారు. కానీ టిక్కెట్‌ వచ్చే అవకాశాలు లేకపోవడంతో జనసేన పార్టీలో చేరి, టిక్కెట్‌ పొందారు. à°—à°¤ ఎనిమిదేళ్ల నుంచి ప్రజల మధ్య వున్నానని, ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని, అందువల్ల తనను ఆదరిస్తారన్న ఆశాభావంతో ఉన్నారు.
 
కాంగ్రెస్‌ తరపున కూండ్రపు అప్పారావు, బీజేపీ అభ్యర్థిగా మైలపల్లి రాజారావుతోపాటు శివసేన, ఆర్‌పీఐ మరో ఐదుగురు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య వున్నట్టు ఎన్నికల వాతావరణం కనిపిస్తున్నది. 2009 ఎన్నికల్లో కూడా ఇక్కడ త్రిముఖ పోరు జరిగింది. అప్పట్లో కాంగ్రెస్‌, టీడీపీ, ప్రజారాజ్యం పోటీచేశాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి కన్నబాబురాజుకు 53,960 ఓట్లు, పీఆర్పీ అభ్యర్థి గొంతిన నాగేశ్వరరావుకు 43,870 ఓట్లు, టీడీపీ అభ్యర్థి లాలం భాస్కరరావుకు 39,525 ఓట్లు వచ్చాయి. కన్నబాబురాజు 10,090 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవడంతో కాంగ్రెస్‌ గెలిచింది. à°—à°¤ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్యనే ప్రధాన పోటీ జరుగింది. టీడీపీ అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబుకు 80,563 కోట్లు రాగా, వైసీపీ అభ్యర్థి ప్రగడ నాగేశ్వరావుకు 72,188 ఓట్లు పోలయ్యాయి. 8,375 ఓట్ల మెజారిటీతో పంచకర్ల విజయం సాధించారు.