ఎన్నికలు ముగియడంతో సమీక్షలు మొదలు

Published: Monday April 15, 2019
నవ్యాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అధికారంలోకి ఎవరొస్తారన్న ఊహాగానాలు కొనసాగుతున్నా.. వాటితో నిమిత్తం లేకుండా.. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పురోగతిపై జరిగే సమీక్షలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభమవుతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని సమీక్షలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్‌ ఇంకా అమల్లో ఉన్నందున రేపటి నుంచి అధికారులే à°ˆ సమీక్షలు చేపట్టనున్నారు. ఇప్పటికే 100 పోలవారాలు పూర్తయ్యాయి. సోమవారం జరిగేది 101వది. ఇందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశంలోని కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో ఆర్‌.కె.జైన్‌, సీఈ ఏకే ప్రధాన్‌, పీపీఏ డీడీ కె.శంకర్‌, కేఆర్‌ఎంబీ చైర్మన్‌ ఆర్‌.కె.గుప్తా.. ప్రాజెక్టు డిజైన్లపై సమీక్షించనున్నారు. ఇదే సమయంలో పనుల వేగాన్ని కూడా సమీక్షిస్తారు. స్పిల్‌వే కుడి ఎడమలలో బండ్‌à°² నిర్మాణానికి సంబంధించి ప్రత్యామ్నాయ డిజైన్లపై పీపీఏ తన అభిప్రాయాన్ని వెల్లడించనుంది.
 
కాగా.. ప్రాజెక్టు పనులన్నీ దరిదాపుగా 69 శాతం వరకూ పూర్తయ్యాయి. హెడ్‌వర్క్స్‌ పనులు 60.89 శాతం .. అంటే 61 శాతం వరకూ జరిగాయి. మట్టి తవ్వకం పనులు 85 శాతం, కాంక్రీట్‌ పనులు 72.40 శాతం అయ్యాయి. డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం పూర్తయింది. రేడియల్‌ గేట్లు 66.22 శాతం పూర్తయ్యాయి. కనెక్టివిటీ ప్యాకేజీ పనులు 61.42 శాతం, కుడి ప్రధాన కాలువ పనులు 90.87 శాతం, à°Žà°¡à°® ప్రధాన కాలువ పనులు 70.30 శాతం వరకూ పూర్తయ్యాయి. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాముల నిర్మాణానికి జెట్‌ గ్రౌటింగ్‌ పనులూ పూర్తయ్యాయి.