ఫలితాలపై మాకెందుకు భయం

Published: Tuesday April 16, 2019
 ‘ఓటమి తప్పదని గ్రహించే ఈవీఎంలపై, ఈసీపై విమర్శలు చేస్తున్నారు’ అని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తిప్పికొట్టారు. భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఈసారి ఎన్నికల్లో ప్రజల మద్దతు మాకు ఊహించినదానికంటే ఎక్కువగా ఉంది. 150 సీట్లకు మించి వచ్చినా ఆశ్చర్యపడనక్కరలేదు’’ అని తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. అంతకు ముందు పార్టీ శ్రేణులతో జరిగిన విలేకరుల సమావేశంలోనూ దీనిపై స్పందించారు. ‘‘మాకు ఓటమి భయమా? మేం గెలిచినప్పుడు కూడా ఎన్నికల్లో అక్రమాలపై పోరాడుతూనే ఉన్నాం. అక్రమాలకు తావిస్తున్న ఈవీఎంల వ్యవస్థను మార్చాలన్నది మా అంతిమ లక్ష్యం. గెలిచినా à°† పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. తాజా ఎన్నికల్లో ఓటర్లు పడ్డ ఇబ్బందులను చూసిన తర్వాతే నేను మళ్లీ మా పోరాటం మొదలు పెట్టాను’’ అని తెలిపారు.
 
ఏ ఎన్నికల్లో అయినా ఓటర్లు ఇంత ఇబ్బంది పడ్డారా అని ప్రశ్నించారు. ‘‘ఓటు వేసేందుకు హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల నుంచి బస్సులు, రైళ్లలో నిలబడి కూడా స్వరాష్ట్రానికి వచ్చారు. à°…à°‚à°¤ ఉత్సాహంతో వచ్చిన వారిని ఈవీఎంల పనితీరు ఉసూరుమనిపించింది. మండుటెండల్లో à°—à°‚à°Ÿà°² తరబడి నిలబడాల్సి వచ్చింది. కొన్ని ఈవీఎంలు మధ్యాహ్నానికిగానీ పనిచేయలేదు. చివరకు ఎన్నికల ప్రధానాధికారి కూడా తన ఓటు తాను వేసుకోలేక ఒకసారి వెనక్కి వెళ్లి, రెండోసారి రావాల్సి వచ్చింది. కొన్ని పోలింగ్‌ బూతుల్లో తెల్లవారుజామున నాలుగున్నర వరకూ క్యూలో నిలబడ్డారు’’ అని చంద్రబాబు వివరించారు. à°’à°• వృద్ధురాలు షిర్డీ నుంచి వచ్చి ఓటు వేసినట్లు సోషల్‌ మీడియాలో చూశానని... తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు ఉన్నవారు కూడా అక్కడ కాదనుకొని ఇక్కడ à°ˆ రాష్ట్రంలో మంచి భవిష్యత్తు కోసం ఓటు వేద్దామని వచ్చారని చెప్పారు. ‘వీళ్లంతా మా ప్రత్యర్థులా? ఓడిపోతామని మేం భయపడాలా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
 
‘ఈవీఎం యంత్రాలు పనిచేయక à°—à°‚à°Ÿà°² తరబడి వరుసల్లో నిలబడిన వారు విసుగుతో వెళ్లిపోయారు. ఇదే సమయంలో కొన్నిచోట్ల రౌడీలు పెట్రేగిపోయారు. దీనివల్ల ఓటర్లు తిరిగి బూత్‌లకు రాని పరిస్థితి ఏర్పడింది. ఇది సరికాదని నేను మధ్యాహ్నం, సాయంత్రం రెండుసార్లు పిలుపు ఇచ్చాను. ఎలాగైనా వచ్చి ఓటు వేయాలని కోరాను. ఒక్క పిలుపుతో ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు మళ్లీ ఉప్పెనలా వచ్చారు. వారి నుంచి ఇంత అభిమానం దొరకడం నా అదృష్టం. వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఓటింగ్‌ యంత్రాలు పగలగొట్టిన చోటే à°°à±€ పోలింగ్‌ నిర్వహిస్తున్నారని... యంత్రాల వైఫల్యం వల్ల ప్రజలు తిరిగి వెళ్లిపోయిన చోట కూడా రీపోలింగ్‌ పెట్టాలని కోరారు.
 
టీడీపీ విజయాన్ని అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేశారని, అయినప్పటికీ గెలుపు నూటికి వెయ్యి శాతం ఖరారైందని పార్టీ శ్రేణులతో చంద్రబాబు తెలిపారు. టీడీపీకి 110 నుంచి 140 సీట్లు వస్తాయని సర్వత్రా అభిప్రాయపడుతున్నారని అన్నారు. టీడీపీ శ్రేణులన్నీ సమన్వయంగా, సంఘటితంగా పనిచేశాయని.. అన్ని వర్గాల ప్రజలంతా కదిలివచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారని తెలిపారు. అందుకే ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షం కానుందన్నారు. టీడీపీకి అండగా నిలబడ్డ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ అరాచకాలను, బీజేపీ తప్పుడు పనులను ఎండగట్టామని.. ప్రతిరోజూ టీడీపీపై దాడులను సమర్థంగా ఎదుర్కొన్నామని చెప్పారు.
 
‘‘8 లక్షల ఓట్లు తొలగించాలని కుట్రలు చేశారు. సకాలంలో స్పందించి భగ్నం చేశాం. పోలింగ్‌ రోజు ఉదయాన్నే ఈవీఎంలు మొరాయించేలా చేశారు. కొత్తవాటి కోసం పట్టుబట్టాం. వెంటనే శాంతిభద్రతల సమస్యలు సృష్టించే కుట్రలు చేశారు. మన పార్టీ నాయకుడు భాస్కర్‌రెడ్డిని హత్యచేశారు. స్పీకర్‌పై దాడి చేశారు. మహిళా అభ్యర్థులపై దౌర్జన్యాలు చేశారు. భయబ్రాంతులకు గురిచేసి పోలింగ్‌కు రాకుండా కుట్రలతో ఓటింగ్‌ శాతాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించారు. కుట్రలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రజలకు పిలుపిచ్చాం.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలను ఓటేయకుండా ఏ దుష్టశక్తీ ఆపలేక పోయింది’ అని పేర్కొన్నారు.