పోలింగ్‌కు ముందే మహిళల చేతుల్లోకి రూ.10 వేలు

Published: Wednesday April 17, 2019
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ జరిగి ఆరు రోజులు గడుస్తున్నా.. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంకా జయాపజయాలపై ఓట్ల కూడికలు, తీసివేతల్లోనే మునిగి తేలుతున్నారు. మే 23à°¨ ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు, ముఖ్యనేతలు, శ్రేణులు గెలుపు అంచనాల్లోనే నిమగ్నమయ్యా రు. పోలింగ్‌ శాతం పెరిగిన నేపథ్యంలో విజయవకాశాలపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. వైసీ పీ అభ్యర్థులు, à°† పార్టీ ముఖ్యనేతల్లో మాత్రం.. పీకే (పసు పు-కుంకుమ, పవన్‌ కల్యాణ్‌) గుబులు పట్టుకుంది. పోలింగ్‌కు ముందే మహిళాసంఘాలకు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు దఫాలుగా రూ.10 వేలు అందజేసి మహిళా ఓటర్లలో కృతజ్ఞతాభావం పెంచారనే అభిప్రాయం à°† వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. దీనికి తోడు పోలింగ్‌కు ముందురోజు ఒక్కో మహిళ పసుపు-కుంకుమ à°ª థకం à°•à°¿à°‚à°¦ ఆఖరి చెక్కు రూ.4 వేలు బ్యాంకుల ద్వారా డ్రా చే సుకున్నారు. à°† మరుసటి రోజే పోలింగ్‌ జరగడం, ఈవీఎంల మొరాయింపుతో ఇంటికి వెళ్లినా..
 
చంద్రబాబు పిలుపుతో తిరిగి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని అర్ధరాత్రి వరకు క్యూలైన్లలో నిలబడి ఓటు వేయడం వైసీపీ అభ్యర్థుల్లో ఆందోళన, అనుమానాలు మరింత పెంచుతోందనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. గెలుపు అసాధ్యమనే అభధ్రతాభావం à°† పార్టీ అభ్యర్థులను వెంటాడుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. à°† పార్టీ ముఖ్య నాయకుల అంతర్గత సమావేశాల్లోనూ à°ˆ అంశంపైనే తీవ్రంగా చర్చ జరుగుతున్నట్లు à°† వర్గాల విశ్వసనీయ సమాచారం. జిల్లాలో 32,39,517 మంది ఓటర్లుండగా.. 26,54,257 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరి లో పురుషులు 13,43,176 మంది, మహిళలు 13,11,031 మంది ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఇంచుమించు పురుష ఓటర్లతో మహిళా ఓటర్లు పోటీ పడడం వైసీపీ అభ్యర్థులను మరింత కలవరపరుస్తోంది.