టిక్ టాక్ యాప్ ను బ్లాక్ చేసిన గూగుల్

Published: Wednesday April 17, 2019

టిక్ టాక్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది గూగుల్. చైనాకు చెందిన ఈ యాప్ ను నిషేధించాలని సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత.. ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియాలో గూగుల్ ప్లే స్టోర్ లో టిక్ టాక్ యాప్ ఇక నుంచి కనిపించదు. అందుబాటులో ఉండదు. డౌన్ లోడ్ చేసుకోలేం. ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ లో కనిపించకపోయినా.. యాపిల్ స్టోర్ లో మాత్రం ఉంటుంది. టిక్ టాక్ యాప్ బ్యాన్ చేయటంపై ఆ కంపెనీ కోర్టులో స్టే కోరింది. ఈ పిటీషన్ తిరస్కరణకు గురైంది. ఈ పరిణామంతో గూగుల్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
టిక్ టాక్ యాప్ వల్ల యువత చెడిపోతున్నారని.. దీన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటీషన్ పై మద్రాస్ హైకోర్టు స్పందించింది. ఈ యాప్ ను నిషేధించాలని ఆదేశించింది. ఈ తీర్పు టిక్ టాక్ యాప్ కంపెనీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికిప్పుడు మద్రాస్ హైకోర్టు తీర్పును తప్పపట్టలేం అంటూ సమర్థించింది సుప్రీంకోర్టు. అయితే తదుపరి విచారణను ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది. దీంతో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన టిక్ టాక్ యాప్ నిషేధం అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగానే గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి యాప్ ను తొలగించింది.