గత ఎన్నికల్లో 2% ఓట్ల తేడాతో వైసీపీ ఓటమి

Published: Friday April 19, 2019
ఓటులో ఎవరూ తగ్గలేదు. కొంచెం అటూ ఇటూగా పంచుకొన్నారు. కోట్ల మంది పోలింగ్‌లో పాల్గొంటే, గెలిచిన పార్టీకీ, à°“à°¡à°¿à°¨ పార్టీకీ మధ్య ఓట్ల తేడా కొన్ని లక్షలే! సీట్ల దగ్గరకు వచ్చేసరికి మాత్రందెబ్బపడిపోయింది. à°—à°¤ ఎన్నికల్లో నవ్యాంధ్రలో అదే జరిగింది. కేవలం 2.06 శాతం ఓట్ల తేడాతో వైసీపీ పరాజయంపాలైంది. à°† పార్టీ కంటే ఆరు లక్షల ఓట్లు అధికంగా సాధించిన టీడీపీ అధికార పగ్గాలు కైవసం చేసుకుంది. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌ను ఏలిన బీఎస్పీ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాంటిదే. 2017 à°† రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 39.7 శాతం ఓట్లు సాధించిన బీజేపీ 312 సీట్లు గెలిస్తే.. అందులో సగం కంటే ఎక్కువ అంటే 22.2 శాతం ఓట్లు సాధించిన బీఎస్పీ కేవలం 19 సీట్లతో సరిపెట్టుకుంది. 22 శాతం ఓట్లు సాధించిన సమాజ్‌వాదీ పార్టీ 47 సీట్లు సాధించడం గమనార్హం.
 
ఓటు శాతం ఉన్నా దానిని సరైన రీతిలో సమీకరించుకోలేకపోతే ఓటమి పాలు కాక తప్పదని à°ˆ ఎన్నికలు నిరూపించాయి. 2016నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలది మరీ చిత్రమైన పరిస్థితి. రిపబ్లికన్‌ పార్టీకి 46.4 శాతం ఓట్లు వస్తే.. డెమోక్రటిక్‌ పార్టీకి అంతకుమించి 48.5 శాతం ఓట్లు పడ్డాయి. కానీ రిపబ్లికన్‌ పార్టీ 306 సీట్లతో విజయం సాధిస్తే.. ఎక్కువ ఓట్లు పడిన డెమోక్రటిక్‌ పార్టీ 232 సీట్లే సాధించి ఓటమిపాలైంది. 2014 ఎన్నికలను పరిశీలిస్తే వైసీపీ గెలుపు వరకూ వచ్చి ఓడిపోయింది. ఎందుకంటే 102 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీకి 1,33,72,862 ఓట్లు పడితే.. 67 సీట్లలో మాత్రమే గెలిచి ఓడిపోయిన వైసీపీకి 1,27,71,323 ఓట్లు పడ్డాయి. రెండు పార్టీల మధ్య తేడా కేవలం 6 లక్షల ఓట్లే. శాతాల్లో చూస్తే కేవలం 2.06 శాతం ఓట్ల తేడాతో వైసీపీ ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. కాగా.. టీడీపీతో కలిసి పోటీచేసిన బీజేపీకి 2.2 శాతం ఓట్లు (8,07,000) వచ్చాయి.