ఏపీలో నానా యాగీ చేస్తున్నారు: చంద్రబాబు

Published: Thursday April 25, 2019
 à°¸à°¾à°°à±à°µà°¤à±à°°à°¿à°• ఎన్నికలు పూర్తవ్వగానే... స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని, వాటికి సిద్ధంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేదన్నారు. నేడు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం సమీక్షలు నిర్వహిస్తే ఎవరూ నోరు మెదపరని, ఇక్కడ తాము ఏదైనా సమీక్ష పెడుతుంటే నానా యాగీ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం పరిధిలో... ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు మాత్రమే పని చేయాలన్నారు.
 
మిగిలిన వాళ్లు ప్రభుత్వం కిందే పనిచేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఎవరి పరిధిలో వారు పని చేయాలని.. ఈసీ ఇష్టానుసారం వ్యవహరిస్తే పాలన అస్తవ్యస్తం అవుతుందన్నారు. ఈ ఐదేళ్లు అధికారులు తమకెంతో సహకరించారని.. అధికారుల సహకారంతోనే అనేక రంగాల్లో తాము నంబర్ 1గా నిలిచామన్నారు. అలాంటిది ఇప్పుడు ఈసీ రూపంలో... అధికారుల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. కులం, మతం, వ్యక్తిగత అజెండాలతో... అధికారుల మధ్య చీలిక తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. దీనిని కూడా సమర్థంగా తిప్పికొడదామని చంద్రబాబు పేర్కొన్నారు.