మున్సిపల్‌ హైస్కూల్‌కు ఫుల్‌ డిమాండ్‌

Published: Monday April 29, 2019
నెల్లూరు భక్తవత్సల నగర్‌లో ఉన్న కేఎన్‌ఆర్‌ మున్సిపల్‌ పాఠశాల ఇతర ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. కార్పొరేట్‌ బడులకు దీటుగా ఫలితాలు సాధిస్తూ, విద్యార్థుల జీవితాలకు బలమైన పునాదులు వేస్తూ సగర్వంగా తలెత్తుకునేలా చేస్తోంది. గతేడాది వరకూ ఇక్కడ సీటు కోసం ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులతో పిల్లల తల్లిదండ్రులు సిఫారసులు చేయించుకునేవారు. ఈసారి మాత్రం వేసవి సెలవుల్లోనే ‘సీట్లు లేవు.. దయచేసి తల్లిదండ్రులు అర్థం చేసుకుని, సహకరించ ప్రార్థన’ అంటూ బ్యానర్‌ పెట్టేశారు. ఇక్కడ ప్రవేశాలకు à°Žà°‚à°¤ పోటీ ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ఏటా à°ˆ హైస్కూల్‌లో ఆరో తరగతిలో ఎంతమంది విద్యార్థులు చేరతారో అంతేస్థాయిలో ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో తరగతుల్లోనూ చేరేందుకు వస్తుంటారు. ఇప్పటికే à°ˆ తరగతుల్లో పరిమితికి మించి విద్యార్థులు ఉండటంతో బ్యానర్‌ పెట్టాల్సి వచ్చిందని హెచ్‌à°Žà°‚ విజయ ప్రకాశరావు చెబుతున్నారు.
 
à°ˆ పాఠశాల నేడు à°ˆ స్థాయికి రావడంలో హెచ్‌à°Žà°‚ విజయప్రకాశరావుదే ప్రధాన పాత్ర. రోజూ ఉదయం 7:30నుంచి రాత్రి 7:30 వరకు ఆయన స్కూల్‌లోనే ఉంటూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. 2006కు ముందు ఇదే పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌à°—à°¾ పనిచేసిన ఆయనకు 2006లో హెచ్‌à°Žà°‚à°—à°¾ పదోన్నతి లభించింది. రెండేళ్లు ఇక్కడే హెచ్‌à°Žà°‚à°—à°¾ పనిచేశాక, మరోచోటకు బదిలీ అయ్యారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయన బదిలీని వ్యతిరేకించి 6నెలలు తిరగకముందే ఇదే స్కూల్‌కు హెచ్‌à°Žà°‚à°—à°¾ తీసుకువచ్చారు. అప్పటినుంచి ఆయన సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.
 
సాధారణంగా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు పాఠశాలలో తమ పిల్లలను చేర్పించడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నం. పెద్దపెద్ద కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లలను అనేకమంది తల్లిదండ్రులు కేఎన్‌ఆర్‌ మున్సిపల్‌ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తుండటం విశేషం. గతేడాది 350 అడ్మిషన్‌లు జరగ్గా, అందులో ఆరో తరగతిలో చేరేందుకు వచ్చిన వారికన్నా 7, 8, 9 తరగతుల్లో చేరేందుకు వచ్చినవారి సంఖ్య ఎక్కువగా ఉంది. వీరిలో 50 శాతానికిపైగా ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చినవారే. దీంతో ఇప్పటికే స్కూల్‌లో 7, 8, 9, 10 తరగతుల్లో పరిమితికి మించి విద్యార్థులు ఉన్నారు. గదులు సరిపోక నాలుగు సెక్షన్లు బయట కూర్చోబెట్టి బోధిస్తున్నారు. ఆరో తరగతిలో చేరేందుకు కూడా ఎక్కువమంది వస్తుండటంతో ఇంటర్వ్యూలు నిర్వహించి అడ్మిషన్లు ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఇక్కడకు వస్తున్నవారికి మొదటి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇక్కడ పనిచేసే నలుగురు ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ చేర్పించడం విశేషం.