భక్తుల వద్ద చోరీకి యత్నం

Published: Tuesday April 30, 2019
అప్పటివరకు పరమభక్తుడిలా ప్రవర్తించాడు. పక్కన భక్తులు నిద్రలోకి జారుకున్న తర్వాత తాను కూడా à°† పక్కనే పడుకుని నిద్రిస్తున్నట్టు నటిస్తూ నెమ్మదిగా పొరుగు భక్తుల బ్యాగుల్లో చోరీకి ప్రయత్నించాడు à°“ చోరుడు. à°ˆ వ్యవహరం మొత్తాన్ని సీసీ కెమెరాల ద్వారా పసిగట్టిన కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని à°† వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
 
విజయనగరం జిల్లా సీతారామపురానికి చెందిన శివకుమార్‌ పాతనేరస్థుడు. ఇప్పటికే అతనిపై ఐదు కేసులు ఉన్నాయి. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతూ మరికొన్ని చోరీలు చేసేందుకు ఆదివారం తిరుమల చేరుకున్నాడు. రాత్రి ఆలయం ముందున్న వాహన మండపం వద్ద గుంపులుగా నిద్రిస్తున్న భక్తుల వద్దకు వెళ్లాడు. కాసేపు అటు ఇటూ తచ్చాడాడు. సోమవారం వేకువజామున 4 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో గాఢ నిద్రలో ఉన్న à°“ భక్తబృందం పక్కన కూర్చున్నాడు.
 
తనకు కూడా నిద్రవస్తున్నట్టు నటించి à°† బృందం పక్కనే పడుకున్నాడు. భక్తులు నిద్రలో ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత వారి బ్యాగులో చేయిపెట్టి చోరీకి ప్రయత్నించాడు. à°ˆ వ్యవహరాన్ని కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా గమనించి వెంటనే విజిలెన్స్‌ వీఐ శివశంకర్‌ సిబ్బందితో కలసి అక్కడికి చేరుకుని శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పట్టుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతని వద్దనున్న అప్పటికే చోరీ చేసిన మూడు సెల్‌ఫోన్లు, రూ.300 నగదు స్వాధీనం చేసుకుని వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు.