నిబంధనల ప్రకారం వెళ్లాలన్న ఈసీ

Published: Wednesday May 01, 2019
 à°µà±à°¯à°µà°¸à°¾à°¯à°¶à°¾à°– మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మంగళవారం అమరావతి సచివాలయంలో నిర్వహించదలిచిన సమీక్షా సమావేశానికి ఆశాఖ ఉన్నతాధికారులు డుమ్మా కొట్టారు. రాష్ట్రంలో ఇటీవల అకాల వర్షాలకు ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడం, కరవు పరిస్థితుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ఖరీఫ్‌ సాగుకు చేపట్టాల్సిన ముందస్తు ప్రణాళికలు, రైతులకు రాయితీ విత్తనాల పంపిణీకి చేపట్టాల్సిన చర్యలు, ఫణి తుఫాన్‌ నేపథ్యంలో రైతులకు ఇవ్వాల్సిన సూచనలపై మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. à°ˆ సమావేశానికి హాజరు కావాలని ఏప్రిల్‌ 24నే వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్‌, ప్రత్యేక కమిషనర్‌ మురళీధర్‌రెడ్డిలకు మంత్రి కార్యాలయం నుంచి లేఖలు పంపారు. మంత్రి పంపిన వర్తమానాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వ్యవసాయశాఖ అధికారులు పంపారు. ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం దీనిపై సూటిగా ఏ విషయం తెలపకుండా ఎన్నికల నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచిస్తూ ఎన్నికల కోడ్‌ నిబంధనల ప్రతిని జతచేసి పంపింది. అయితే, ప్రకృతి వైపరీత్యాల సమస్య ఎదురైనప్పుడు మంత్రులు సమీక్షలు నిర్వహించవచ్చని ఎన్నికల కోడ్‌ నిబంధనల్లో ఉంది.
 
అకాల వర్షాల వల్ల వాటిల్లిన నష్టం గురించి తాను సమీక్ష చేస్తున్నందువల్ల అధికారులు వస్తారని భావించి మంత్రి సచివాలయంలోని తన కార్యాలయానికి వచ్చారు. కానీ, ఆయన వర్తమానం పంపిన ఇద్దరు అధికారులు రాలేదు. మంత్రి సుమారు 3గంటలపాటు తన చాంబర్‌లో అధికారుల కోసం వేచి చూశారు. à°† ఇద్దరు అధికారులు మంగళవారం అమరావతిలో లేకుండా తిరుపతిలో వెళ్లారు. à°ˆ విషయం మంత్రికి ఆలస్యంగా తెలిసింది. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. కోడ్‌ అమల్లో ఉండగా మంత్రి సమీక్షకు వెళ్తే ఏ సమస్య వస్తుందోనన్న భయంతోనే జిల్లా పర్యటనకు వెళ్లారని అంటున్నారు.
 
‘నేను ముందుగానే à°ˆ సమావేశంపై సమాచారం ఇచ్చాను. ఎన్నికల కోడ్‌ నిబంధనల్లో కూడా ప్రకృతి వైపరీత్యాలపై సమీక్షను మంత్రి నిర్వహించవచ్చని ఉంది. అయినా అధికారులకు ఏదో ఇబ్బంది ఉన్నట్లుంది. దీనిపై ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకొంటాం’ అని మంత్రి చంద్రమోహనరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’à°•à°¿ చెప్పారు. తాను రాజీనామా చేస్తానని చెప్పిన విషయాన్ని కొందరు వక్రీకరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘మంత్రులు సమీక్షలు జరపకూడదని ఎన్నికల కమిషన్‌ అడ్డు చెప్పి దానికి సంబంధించిన నిబంధనలు చూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పాను. అటువంటి నిబంధనలు ఉంటే సుప్రీం కోర్టుకు వెళ్తానని ప్రకటించాను. కానీ ఎన్నికల కమిషన్‌ అలాంటి నిబంధనలు చూపించలేదు. సమీక్షించవద్దని కూడా అడ్డు చెప్పలేదు. రాకపోవడానికి అధికారుల కారణాలు ఏమిటో నేను తెలుసుకోవాల్సి ఉంది. అందువల్ల రాజీనామా ప్రసక్తి లేదు’ అని ఆయన వివరించారు.