అనంతలో దెబ్బతిన్న ఉద్యాన పంటలు

Published: Thursday May 02, 2019
అకాల వర్షం రాయలసీమ రైతును నిండా ముంచింది. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీవర్షం వర్షం కురిసింది. గుడిబండ మండలంలో అత్యధికంగా 46.1మి.మీ వర్షపాతం నమోదైంది.
 
à°ˆ వర్షానికి జిల్లా వ్యాప్తంగా 126.48హెక్టార్లల్లో బొప్పాయి, మామిడి, చీనీ, కళింగర, à°…à°°à°Ÿà°¿ పంటలు దెబ్బతినడంతో రూ.1.86కోట్ల నష్టం వాటిల్లింది. నార్పల, à°¡à°¿.హిరేహాల్‌లోని 80హెక్టార్లల్లో రూ.45.88లక్షలు విలువైన వరి పంటనష్టం జరిగింది. à°•à°¡à°ª జిల్లా పులివెందుల నియోజకవర్గంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు దాదాపు 1,250ఎకరాల్లో అరటితోటలు నేలకొరిగాయి. యర్రబల్లె పంచాయతీ పరిధిలోని నల్లపురెడ్డిపల్లె, మల్లికార్జునపురం, à°‡.కొత్తపల్లె, నల్లగొండువారిపల్లె తదితర గ్రామాల్లో దాదాపు వెయ్యి ఎకరాలు, లింగాల మండలం ఇప్పట్లలో 170ఎకరాల్లో à°…à°°à°Ÿà°¿ నేలమట్టమైంది. కర్ణపాపాయపల్లె, పార్నపల్లె, గ్రామాల్లో మరో 60ఎకరాల్లో పంట నేలకూలింది.
దాదాపు రూ.13కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కర్నూలు జిల్లాలో 345 హెక్టార్లలో à°…à°°à°Ÿà°¿, 50 హెక్టార్లలో మామిడి, బొప్పాయి, మునగ పంటలు దెబ్బతినడంతో, రూ.6.5కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈదురుగాలులకు జిల్లా వ్యాప్తంగా 748 విద్యుత్‌ స్తంభాలు, 31 ట్రాన్స్‌ఫార్మార్లు నేలకూలడంతో à°† శాఖకు రూ.20లక్షల దాకా నష్టం వాటిల్లింది.
 
హాలహర్వి మండలంలో కురిసిన భారీవర్షాలకు ఇటీవలే రూ.20లక్షలతో మరమ్మతు చేసిన బిల్లేహాల్‌ చెరువుకు గండిపడింది. రూ.3.50కోట్లతో నిర్మించిన హాలహర్వి-నెట్రవట్టి రోడ్డు వర్షపునీటి ప్రవాహానికి కోతకు గురై ధ్వంసమైంది. వెలుగోడులో గాలివానకు రేకులషెడ్డు ఎగిరిపోయింది. రేకులు వేగంగా వచ్చి తగలడంతో హుసేన్‌బీ అనే వృద్ధురాలు మృత్యువాత పడింది. రెండురోజుల క్రితం వరకూ తీవ్ర ఎండలతో పొలాలకు వెళ్లని రైతులు దుక్కులు దున్నుకునేందుకు సిద్ధమవుతున్నారు.