మరింత బలపడిన పెను తుఫాన్‌

Published: Thursday May 02, 2019
ఫణి’ పెను తుఫాను తీరాన్ని గడగడలాడిస్తోంది. బంగాళాఖాతంలో ‘à°…à°²’జడి నెలకొంది. సముద్రపు కెరటాలు ఎగిసిపడుతున్నాయి. తుఫాను తీరంవైపు దూసుకొస్తోంది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నానికి ఒడిసాలోని పూరీ దగ్గర గోపాల్‌పూర్‌- చాందబలి మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. à°† సమయంలో గాలుల ఉధృతి గంటకు 170-180 కిలోమీటర్లు ఉండొచ్చని, à°ˆ ఉధృతి వేగం 200 కిలోమీటర్లకు పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. కాగా, ‘ఫణి’ దిశ మార్చుకుంది. బుధవారం ఉదయం వరకు వాయవ్యంగా పయనించిన తర్వాత ఉత్తర వాయవ్యంగా.. అటు పిమ్మట ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుంది. à°ˆ క్రమంలో కొన్ని గంటలపాటు నెమ్మదిగా కదిలి మరింత బలపడింది.
 
 
బుధవారం రాత్రికి విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 320à°•à°¿.మీ. ఒడిసాలోని పూరీకి దక్షిణ నైరుతి దిశగా 570à°•à°¿.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. అయితే బుధవారం నుంచి ఉత్తర ఈశాన్యంగా పయనిస్తున్న క్రమంలో పెను తుఫాన్‌ నెమ్మదిగా ఉత్తర కోస్తా దిశగా వచ్చే అవకాశం ఉంది. గురువారం సాయంత్రానికి విశాఖపట్నానికి 100-150à°•à°¿.మీ. దూరంలోకి.. ఉత్తరకోస్తా జిల్లాల వైపు పయనించేటప్పుడు కళింగపట్నానికి అతి చేరువగా అంటే 50-60à°•à°¿.మీ., బారువ వద్ద మరింత చేరువగా వస్తుందని అంచనా. నిపుణుల అంచనా ప్రకారం కళింగపట్నానికి సమాంతరంగా వచ్చినప్పుడు తుఫాన్‌లో కొంత భాగం భూమిపైకి వస్తుంది. అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లా సరిహద్దు దాటే సమయంలో రమారమి 130 à°•à°¿.మీ. పొడవున తుఫాన్‌లో కొంత భాగం భూఉపరితలంపై పయనించనుంది. దీనివల్ల శ్రీకాకుళం జిల్లాలో పెనుగాలులు వీయడంతోపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. గురు, శుక్రవారాలు ఉత్తర కోస్తాలోని విజయనగరం, విశాఖ జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.