ఏపీలో వడదెబ్బకు 17 మంది మృతి

Published: Tuesday May 07, 2019

ఆంధ్రప్రదేశ్‌లో à°Žà°‚à°¡à°² తీవ్రత పెరిగింది. వడదెబ్బకు 17 మంది మృతి చెందారు. à°Žà°‚à°¡à°² తీవ్రత అంతకంతకుపెరిగిపోతోంది. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. వృద్ధులు, పిల్లలు అనే వయసు బేధం లేకుండా అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి లాగేస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడేనికి చెందిన చాంబి పఠాన్ వయసు 70 ఏళ్లు. పంచాయతీ కార్యాలయంలో పెన్షన్ తెచ్చుకుందామని సోమవారం వెళ్లాడు. à°Žà°‚à°¡, వేడి గాలులకు వడదెబ్బకు గురయ్యాడు. పెన్షన్ తీసుకుని ఇంటికి వచ్చిన కొద్ది గంటలకే మరణించాడు. వంకవారిగూడేనికి చెందిన కుంజా మహాలక్ష్మికి మూడేళ్లు. ఆదివారం ఇంటి బయట అడుకుంది. సాయంత్రానికి బాగా నిరసపడి. వైద్యం అందిస్తుండగానే మృతి చెందింది. భానుడి భగభగలకు ప్రాణాలు హరించుకుపోతున్నతీరిది. సోమవారం ఒక్కరోజే ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరులో నలుగురు వడగాల్పులకు బలయ్యారు. à°ˆ విధంగా ఏపీలో ఇప్పటివరకు వడదెబ్బకు 17 మంది మృతి చెందారు.