టీడీపీ చరిత్రలోనే ఎరుగని ఓటమి

Published: Friday May 24, 2019
ఇది ఘోర పరాజయం! అసాధారణ పరాభవం! 1982లో తెలుగుదేశం ఏర్పాటైన తర్వాత ఎప్పుడూ ఎదురుకాని ఓటమి! ఒక్క ముక్కలో చెప్పాలంటే... టీడీపీ కకావికలమైంది. కనీవినీ ఎరుగని రీతిలో, కలలోనైనా ఊహించని విధంగా దెబ్బతింది. టీడీపీ ఏర్పాటైన తర్వాత ఐదుసార్లు విజయం సాధించింది. తాజా ఫలితాలతో కలిపి నాలుగుసార్లు ఓడిపోయింది. ఇన్ని ఓటముల్లో ఇదే అతి ఘోరమైన ఓటమి. 1989లో టీడీపీ తొలి ఓటమి ఎదుర్కొంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీకి తొంభై సీట్లు వచ్చాయి. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి మళ్ళీ 2004లో ఆ పార్టీ ఓడిపోయింది. అప్పుడు 47 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 2009లో మరోసారి ఓటమి ఎదురైంది. కానీ, అప్పుడు తొంభై సీట్లు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఓడిపోయింది. నిష్పత్తి ప్రకారం చూసుకుంటే... 2004లో కంటే ఇప్పుడే తక్కువ సీట్లు వచ్చినట్లు!
 
à°—à°¤ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం అసెంబ్లీ సీట్లను బీజేపీతో కలిపి టీడీపీ గెలుచుకుంది. వైసీపీకి ఒక్కటీ దక్కలేదు. ఈసారి అలాంటి పరిస్థితి టీడీపీకి ఏకంగా నాలుగు జిల్లాల్లో ఎదురైంది. కర్నూలు, విజయనగరం, నెల్లూరు, à°•à°¡à°ª జిల్లాల్లో మొత్తం సీట్లను వైసీపీ స్వీప్‌ చేసింది. పోయినసారి à°•à°¡à°ª జిల్లాలో à°’à°• సీటు టీడీపీ గెలుచుకోగలిగింది. ఈసారి అది కూడా రాలేదు. ఇక... చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆయన మినహా టీడీపీ అభ్యర్థులెవరూ గెలవలేకపోయారు.
 
1994 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 26 సీట్లు గెలుచుకోగలిగింది. ఉమ్మడి అసెంబ్లీలో ఉన్న సీట్లలో పదో వంతు కూడా రాకపోవడంతో à°† పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాకు కనీసం 30 సీట్లు రావాలి. ఇప్పుడు నవ్యాంధ్రలో టీడీపీ కనీసం విపక్ష హోదా దక్కించుకోగలిగింది.
 
 
టీడీపీకి కంచుకోటలుగా భావించే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ à°† పార్టీకి చుక్కెదురైంది. రాజధాని ఏర్పాటు వల్ల à°ˆ జిల్లాలు అత్యధికంగా లబ్ధి పొందుతాయన్న అభిప్రాయం ఉంది. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల తక్షణ, ప్రత్యక్ష లబ్ధి కూడా à°ˆ జిల్లాకే దక్కుతోంది. కానీ, à°ˆ జిల్లాల్లోనూ పార్టీకి ప్రజాదరణ దక్కలేదు. వరుసగా à°—à°¤ ఐదు ఎన్నికల నుంచి గెలుస్తూ వస్తున్న సీనియర్‌ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర, à°—à°¤ మూడు ఎన్నికల నుంచి గెలుస్తున్న మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వంటి సీనియర్లు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోవైపు... à°ˆ ఐదేళ్ల పాలనా కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు అమలు చేసిన నియోజకవర్గాల్లో కూడా ఓటమి ఎదురు కావడం విశేషం. కియా ఫ్యాక్టరీని నెలకొల్పిన పెనుకొండ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న పోలవరం నియోజకవర్గాల్లో కూడా ఓటమి తప్పలేదు.