రామ్మోహన్‌నాయుడు గెలుపు కోర్టును ఆశ్రయిస్తానన్న దువ్వాడ

Published: Saturday May 25, 2019
 à°•à±à°·à°£à°•à±à°·à°£à°‚.. ఉత్కంఠ రేపిన శ్రీకాకుళం పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల్లో చివరికి టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడినే విజయం వరించింది. క్రాస్‌ ఓటింగే ఆయన విజయానికి దోహదపడింది. వైసీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ కొంపముంచింది. పోస్టల్‌బ్యాలెట్‌లో అధికంగా చెల్లని ఓట్లు గుర్తించారని... వాటిని రీకౌంటింగ్‌ చేయాలని వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ చేసిన అభ్యర్థన మేరకు అధికారులు మళ్లీ ఓట్లు లెక్కించారు. శుక్రవారం వేకువజామున 4 à°—à°‚à°Ÿà°² వరకు à°ˆ ప్రక్రియ సాగింది. అనంతరం 6653 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్‌నాయుడు గెలుపొందినట్టు ప్రకటించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడింది. à°† సమయంలో లెక్కింపు కేంద్రం వద్దనే ఉన్న అచ్చెన్నాయుడు భావోద్వేగానికి గురయ్యారు.
 
శ్రీకాకుళం పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు టీడీపీ, వైసీపీ శ్రేణులతోపాటు జిల్లావాసుల్లో ఉత్కంఠ రేపాయి. గురువారం సాయంత్రమే à°ˆ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండగా.. శుక్రవారం వేకువజాము వరకూ లెక్కింపు ప్రక్రియ సాగింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో పెద్దమొత్తంలో చెల్లని ఓట్లు గుర్తించారని.. వాటిని పునఃపరిశీలించాలన్న వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ అభ్యర్థన మేరకు అధికారులు à°°à±€ కౌంటింగ్‌ చేశారు. గురువారం రాత్రి 11 à°—à°‚à°Ÿà°² వరకు à°ˆ ప్రక్రియ సాగినా.. ఓట్ల విషయంలో వైసీపీకి లాభం చేకూరలేదు. దీంతో కొన్ని పోలింగ్‌బూత్‌లలో 90 శాతం పైబడి టీడీపీ అభ్యర్థికి ఓట్లు లభించాయని.. అక్కడ రీపోలింగ్‌ నిర్వహించాలని దువ్వాడ మళ్లీ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఎన్నికలు ముగిశాక.. à°ˆ అంశాన్ని పీవో, ఆర్వోల వద్ద ప్రస్తావించకుండా ఇప్పుడు ఫలితాల సమయంలో అభ్యంతరం వ్యక్తంచేస్తే కుదరదని అధికారులు స్పష్టం చేశారు. ఇటు కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఇరుపార్టీలకు చెందిన నాయకులు గుమిగూడారు.