ప్రత్యేక అథారిటీ ద్వారా ఒక్కటిగా నవరత్నాల అమలుకు శ్రీకారం

Published: Thursday May 30, 2019
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వాంగ సుందరంగా సన్నాహాలు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకారం అనంతరం చేసే ప్రసంగంలో జగన్‌ కొత్తగా ఇచ్చే వరాలజల్లు ఏమైనా ఉంటుందేమోనని ఆశగా రాష్ట్రం ఎదురు చూస్తోంది. 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర రెడ్డి హైదరాబాద్‌ లాల్‌ బహుదూర్‌ స్టేడియంలో వ్యవసాయానికి ఏడు à°—à°‚à°Ÿà°² ఉచిత విద్యుత్తు పథకంపై తొలి సంతకం చేశారు. ఇదే తరహాలో గురువారం జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సందర్భంగా జగన్‌ కూడా రాష్ట్ర ప్రజలకు కొత్త వరాన్ని ప్రకటిస్తారేమోనన్న ఆసక్తి నెలకొంది.
 
అయితే, ముఖ్యమంత్రిగా తాను చేసే తొలి ఉపన్యాసంలో ఎన్నికల హామీ అయిన నవరత్నాలుకే జగన్‌ అత్యధిక ప్రాధాన్యం ఇస్తారని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. జగన్‌ మొదటి సంతకం పెట్టే ఫైలంటూ ఏదీ ఉండదని, నవరత్నాలు అమలుపై ఆయన అక్కడ విస్పష్టమైన ప్రకటన చేస్తారని వెల్లడిస్తున్నారు. నవరత్నాలులో ఒకటయిన పింఛన్ల కుఆయన తన ప్రసంగంలో అధిక ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. అధికారంలోకి వస్తే సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచుతానని జగన్‌ తన పాదయాత్ర, ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారు. à°ˆ మేరకు పింఛన్ల పెంపుదలపై ఆయన ప్రకటన చేస్తారని వారు వివరిస్తున్నారు. అదేవిధంగా, డ్వాక్రా మహిళల రుణమాఫీపైనా తన అభిప్రాయాన్ని వెల్లడించే వీలుందని అంటున్నారు.