అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచులు... మాజీలైనా అందని సొమ్ము

Published: Monday June 03, 2019
గ్రామాల అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అప్పట్లో సర్పంచులు ఉపాధి హామీ పనులు చేయించడానికి ముందుకొచ్చారు. వారి పదవీకాలం పూర్తయినా.. చేసిన పనులకు బిల్లులు పొందలేని దుస్థితిలో ఉన్నారు. చొరవతో గ్రామాభివృద్ధికి ముందుకొస్తే.. అప్పులపాలయ్యామని వాపోతున్నారు. సిమెంటు రోడ్లతో పాటు పాఠశాలల్లో ఆటస్థలాల అభివృద్ధి, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు చేపట్టారు. కొన్ని గ్రామాల్లో స్మశానాలను అభివృద్ధి చేసుకున్నారు. మరి కొన్ని గ్రామాలకు అవెన్యూ ప్లాంటేషన్‌ పేరుతో రోడ్డుకిరువైపులా మొక్కల పెంపకానికి పనులు మంజూరుచేశారు. వాటికీ à°—à°¤ ఆర్నెల్లుగా నిర్వహణ నిధులందలేదు. రైతులు వ్యక్తిగతంగా ఉద్యానవన పంటలు సాగుచేసుకుంటే.. వాటి నిర్వహణ వ్యయం ఇవ్వలేదు. కొన్ని గ్రామ పంచాయతీల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం షెడ్ల నిర్మాణాలు చేపట్టారు. వాటికి నిధుల్లేక కొన్ని చోట్ల అసంపూర్తిగా ఆగిపోయాయి. పనులు పూర్తి చేసిన కొందరు మాజీ సర్పంచ్‌లకు ఇప్పటికీ చెల్లించలేదు.
 
రాష్ట్రంలో à°—à°¤ ఏడాది పంచాయతీల్లో 7 వేల కిలోమీటర్లకు పైగా సిమెంటు రోడ్లను నిర్మించారు. ఇందుకోసం పంచాయతీలకు అందుతున్న 14à°µ ఆర్థిక సంఘం నిధులతో జోడించి ఉపాధి నిధుల ద్వారా చేపట్టేందుకు కలెక్టర్లు పనులు మంజూరుచేశారు. మరో 24 వేల à°•à°¿.మీ. సిమెంటు రోడ్లు పనులు మంజూరు చేసినా.. వాటిని ప్రారంభించే సాహసం చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఉపాధి హామీ పథకంలో వేతనాల కోసం చేసిన ఖర్చుకు అనుగుణంగా నిర్మాణ పనులు(మెటీరియల్‌) చేపట్టేందుకు కేంద్రం నిధులిస్తోంది. వేతనాల కోసం ఖర్చు చేసిన ప్రతి రూ.60à°•à°¿ అదనంగా రూ.40 నిర్మాణ పనుల కోసం ఖర్చు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో à°—à°¤ ఆర్థిక సంవత్సరంలో రూ.4,908 కోట్ల మేర ఉపాధి కూలీలకు పనులు కల్పించి వేతనాలు అందించారు. దాని ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రానికి మెటీరియల్‌ కాంపోనెంట్‌ రూపంలో రూ.3,272 కోట్లు అందించాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 25 శాతం పోను రూ.2,454 కోట్లు కేంద్రం చెల్లించాలి. à°—à°¤ నెలలో కేవలం రూ.367 కోట్లే చెల్లించింది. రాష్ట్రానికి మొదట్లో కేటాయించిన లేబర్‌ బడ్జెట్‌ 20 కోట్ల పనిదినాలకు సంబంధించి మాత్రమే మెటీరియల్‌ కాంపోనెంట్‌ ఇస్తామని, అదనంగా కేటాయించిన పనిదినాలకు సంబంధించి ఇవ్వబోమని తేల్చి చెప్పింది. అయినా మన రాష్ట్రానికి ఇంకా రూ.1800 కోట్ల మెటీరియల్‌ కాంపోనెంట్‌ కేంద్రం నుంచి రావలసి ఉంది.