రండి.. మాట్లాడుకుందాం ...పవన్‌ నుంచి పిలుపు

Published: Thursday June 06, 2019
‘సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమిపైన, సాధించిన ఓట్ల తీరుపైన, నియోజకవర్గాల్లో బలాబలాలపైన మాట్లాడుకుందాం à°°à°‚à°¡à°¿. అందుబాటులో ఉన్న నివేదికలతో వచ్చి.. మనసు విప్పి చెప్పండి’ అంటూ à°—à°¤ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు à°† పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నుంచి అందిన ఆహ్వానమిది. పార్టీ వ్యవహారాలపై జిల్లాల వారీగా సమీక్షించేందుకు బుధవారం నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పోటీ చేసి ఓటమి పాలైన వారితో పవన్‌కళ్యాణ్‌ భేటీ కానున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అందరితో చర్చించి à°“ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఉన్న పార్టీ పరిస్థితి, నియోజక వర్గాల వారీగా లభించిన ఓట్లు, ఏఏ సామాజిక వర్గాలు కలిసి వచ్చాయి...వ్యతిరేకించిన వర్గాలు ఏమిటనే దానిపై పోటీ చేసిన వారి నుంచి ఆరా తీస్తారు. కొవ్వూరు, గోపాలపురం నియోజక వర్గాల నుంచి బీఎస్పీ, ఉండి నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థులు, 12 నియోజకవర్గాల నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. వీరిని మాత్రమే సమీక్షకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
 
సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని మూటకట్టుకోవాలని తహతహలాడిన జనసేన లక్ష్యాలు దెబ్బతిన్నాయి. ఊహించింది à°’à°•à°Ÿà°¿.. జరిగింది మరొకటి. ఆఖరుకి పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి, సోదరుడు నాగబాబు నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి ఓటమి చెందారు. à°ˆ పరిణామం జనసేనలో తీవ్ర నిరుత్సాహాన్ని నింపాయి. అప్పటి వరకు పార్టీ అంటేనే తాము అన్నట్టుగా వ్యవహరించిన అభిమానులంతా ఒక్కసారిగా నీరుగారిపోయారు. ఇప్పటి వరకు సామాజిక మాధ్యమాల్లో పార్టీపరమైన సమాచారాన్ని చొప్పించే ప్రయత్నాలేవీ జరగడం లేదు. మిగతా పార్టీల తీరును à°Žà°‚à°¡ గట్టడంలో ముందు వరుసలో ఉన్న జనసేన కాస్తా ఇప్పుడు వెనుకబడింది. అప్పుడు ఉన్నంత స్పీడులో ఇప్పుడు పదో శాతం కూడా కనిపించడం లేదు. జనసైన్యం కదలిక తగ్గింది. ఇలాంటి తరుణంలో పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఆకస్మికంగా జిల్లాల వారీ సమీక్షలు నిర్వహించాలని తలపెట్టారు. ముందస్తుగా తాను పోటీ చేసి ఓటమి పొందిన పశ్చిమ నుంచే ప్రారంభించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి అందరికీ బుధవారం సమాచారం అందించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం రెండు à°—à°‚à°Ÿà°² తరువాత సమీక్ష ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.