సైకిల్‌ దిగి..ఫ్యాన్‌ గాలికి తహతహ

Published: Friday June 07, 2019
జిల్లాలో ఆయన టీడీపీ సీనియర్‌ నాయకుడు. సుదీర్ఘ కాలంగా à°’à°• అత్యున్నత పదవిలో రాణించారు. సామాజికపరంగా బలమైన నేత. ఆస్తి, అంతస్థులో ఎవరికీ తగ్గరు. ప్రస్తుతం ఆయన వైసీపీ వైపు చూస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇదే విషయంపై ఒకటే హోరు. పార్టీ మారతారంటూ కొందరు, వైసీపీ తలుపులు మూసేసిందంటూ ఇంకొందరు ఎవరికి తోచినట్టు వారి భాష్యం చెబుతున్నారు. మొన్నీ మధ్య సదరు నేత వైసీపీ సీనియర్లతో భేటీ అయ్యారు. టీడీపీలో కొనసాగుతున్నా వ్యాపారపరంగా ఆయనకు వైసీపీ నేతలతో à°’à°•à°¿à°‚à°¤ సాన్నిహిత్యం ఉంది. తగ్గట్టుగానే విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల ప్రముఖులతో స్నేహ సంబంధాలు ఉన్నాయి.
 
ఇవన్నీ à°’à°• ఎత్తు. తాజాగా ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు తహతహలాడుతున్నట్టు సమాచారం. ప్రత్యేకించి ఉండి నియోజకవర్గంలో à°ˆ తరహా వర్గాలు పార్టీలో చేర్చుకోవడానికి వైసీపీ నేతలు తడబడుతున్నారు. ఇప్పటికిప్పుడు వీరి చేరిక పార్టీకి పెద్దగా అవసరం లేకపోయినా, ఎన్నికలకు ముందు నుంచే సంకేతాలు పంపడం, అప్పట్లో వీలు కాకపోవడం, వచ్చే ప్రజా తీర్పు పట్ల అన్ని పార్టీల్లో సందిగ్దత ఉండడంతో ఇది వాయిదా పడుతూ వచ్చింది. à°ˆ మధ్యనే తిరిగి మరోసారి ప్రచారం ఊపందుకుంది. ఇంతకు ముందు కాంగ్రెస్‌లో కాకలు తీరిన నేతల్లో ఈయనొకరు. జిల్లాస్థాయి పదవి దక్కడంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో సీనియర్‌ నేత పితాని సత్యనారాయణ నేరుగా సదరు నేతకు ఊతమిస్తూ వచ్చారు. తిరుగులేని పితాని మద్దతుతో ఏకచత్రాధిపత్యం సాగింది.