బీజేపీకి జనహితమే లక్ష్యం

Published: Monday June 10, 2019
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పూర్తిస్థాయిలో కేంద్రం à°…à°‚à°¡à°—à°¾ ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ఆదివారం తొలిసారి తిరుపతి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజా ధన్యవాద సభలో
ప్రసంగించారు. వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకొనేందుకు వచ్చానని అన్నారు. 130 కోట్ల మంది దేశ ప్రజల కలలు సాకారం కావడానికి స్వామి ఆశీర్వాదం కోరతానన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దేశప్రజల కలలను సాకారం చేయడంలో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
 
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ప్రధాని అభినందనలు తెలిపారు. ‘కేంద్రలో మరోసారి పూర్తిమెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు అవకాశం ఇచ్చారు. అలాగే ఏపీలో జగన్‌ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయ à°¨ ఏపీని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు వెనకడగు వేయరని ఆశిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్రం à°…à°‚à°¡à°—à°¾ ఉంటుంది. à°ˆ విషయాన్ని ఏపీ ప్రజలకు నేను నమ్మకంగా చెబుతున్నాను. ఏపీలో అనేక అవకాశాలున్నాయి. వ్యవసాయం నుంచి విజ్ఞానం వరకూ, ఆవిష్కరణలు మొదలుకొని స్టార్ట్‌పల వరకూ అనేక అంశాలలో ఏపీ నవ్యాంధ్ర దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంది. సరికొత్త భారత్‌ నిర్మాణం దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.. అదే విధంగా రాష్ట్రాలు ముందుకెళ్లాలి. అప్పుడే సరికొత్త భారత్‌ సాధ్యం. సబ్‌à°•à°¾ సాత్‌ సబ్‌à°•à°¾ వికా్‌సలో రాష్ట్రాలు, ప్రజల భాగస్వామ్యం కూడా ఉంది. à°ˆ సంకల్పాన్ని చరితార్థం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం’ అని ప్రధాని అన్నారు.
 
‘కొందరు ఎన్నికల ఫలితాల ప్రభావం నుంచి ఇంకా తేరుకోలేదు. అది వారి బలహీనత. బీజేపీ వరకూ ఎన్నికల ఘట్టం ముగిసింది. 130 కోట్లమంది ప్రజలకు సేవ చేసే అధ్యాయం ప్రారంభమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో కృషి చేసిన వారికి నా ధన్యవాదాలు. బీజేపీకి ఎన్నికలొక్కటే పరమావధి à°•à°¾ దు. కార్యకర్తలు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని భవ్య భారత నిర్మాణంలో పాల్గొనేలా వ్యవస్థ ఉంది. కేంద్రం తీసుకొచ్చే కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో అమలు చేసి చూపిస్తాం.’