నా పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు

Published: Tuesday June 11, 2019

‘‘నా పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు తెరుస్తున్నారు. అసభ్యకర పోస్టింగ్‌లు పెడుతున్నారు. అర్ధరాత్రి ఫోన్లు చేసి వేధిస్తున్నారు. ఫోన్‌ రింగ్‌ అయితేనే నా పిల్లలు ఉలిక్కిపడుతున్నారు. నా మనోధైర్యాన్ని, కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులను చట్టపరంగా శిక్షించండి’’ అంటూ టీడీపీ అధికార ప్రతినిధి యామినీశర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయ అధికారులకు à°ˆ మేరకు ఆమె వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘‘నా ఫేస్‌బుక్‌ అధికారిక పేజీ సాధినేని యామినీశర్మ పేరుతో ఉంది, ఇదికాకుండా యామినీ సాధినేని పేరుతో à°’à°•à°Ÿà°¿, యామినీ సాధినేని యువసేన పేరుతో మరొకటి ఇలా ఫేక్‌ అకౌంట్లు సృష్టించారు. వాటిలో ప్రధాని మోదీ, సీఎం జగన్‌, ఇతర నేతలపై నేనే పోస్టింగ్‌లు పెట్టినట్లు అసభ్య పదాలు వాడుతూ విపరీతంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. నేను ఇలాంటి పోస్టింగ్‌లు పెట్టానని కొందరైనా నమ్మితే అందుకు నాతో పాటు నా కుటుంబం కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పరువుకు నష్టం కలిగిస్తోన్న వ్యక్తులపై సైబర్‌ నేరాల à°•à°¿à°‚à°¦ కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.