అలవిగాని హామీలు మీరిస్తే.. మేం అమలు చేయాలా?

Published: Thursday June 13, 2019
రైతులకు రుణమాఫీ అనేది తమ పార్టీ గానీ, తమ ప్రభుత్వం గానీ ఇచ్చిన హామీ కాదని మంత్రు లు కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాద వ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను ఆపేస్తున్నామని ఎవరు చెప్పారని నిలదీశారు. బుధవారం సచివాలయంలో వీరు మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ఐదేళ్లు రుణమాఫీ అమలుచేయకుండా రైతులను మోసగించగా.. సీఎం జగన్‌ రైతుల కోసం ఏడాది ముందుగానే రైతు భరోసా పథకం అమలు చేస్తున్న రైతు పక్షపాతి అని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయకుండా, అన్నదాతా-సుఖీభవ పథకం అమలు చేయకుండా జగన్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు.
 
‘రైతులకు పెట్టుబడి నిధి à°•à°¿à°‚à°¦ ఏడాదికి రూ.50,000 అందించే పథకానికి అక్టోబరు నుంచే శ్రీకారం చుడుతున్నాం. à°ˆ పథకంలో 15 లక్షల మంది కౌలు రైతులకు ప్రయోజనాలు కల్పిస్తాం. 40 శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు అందిస్తాం. రుణమాఫీ అనేది అలవిగాని హామీ. చంద్రబాబు అలవిగాని హామీలిచ్చి వాటిని మేం అమలుచేయాలని ఎలా అడుగుతారు’ అని కన్నబాబు నిలదీశారు. ఎన్నికల ప్రచారం, వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేస్తామని తేల్చిచెప్పారు.
 
చంద్రబాబు రుణమాఫీ à°•à°¿à°‚à°¦ రాష్ట్రంలో రైతులకు రూ.87,000 కోట్లు అందించాల్సి ఉండగా, రకారకాల కోతలు విధించి దాన్ని రూ.24,000 కోట్లకు కుదించారని ఆక్షేపించారు. అందులోనే రూ.15,276 కోట్లు మాత్రమే రైతులకు ఇచ్చారని, మిగిలిన నిధులను ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు హడావుడిగా నాలుగో విడత రుణమాఫీగా రూ.3,979 కోట్లు విడుదల చేసినట్లు ప్రచారం చేసి.. రైతుల ఖాతాల్లో రూ.376 కోట్లు మాత్రమే వేసి మోసం చేశారని విమర్శించారు. పౌరసరఫరాల కార్పొరేషన్‌ ద్వారా రైతుల కోసం రూ.4,800 కోట్ల రుణం తీసుకుని వాటిని వేరే అవసరాలకు మళ్లించి రైతులకు అన్యాయం చేశారన్నారు. కేంద్రం కరువు భత్యం à°•à°¿à°‚à°¦ రాష్ట్రానికి ఇచ్చిన రూ.932 కోట్లను కూడా మళ్లించారని ఆరోపించారు.
 
ఓటమితో చంద్రబాబు మైండ్‌ బ్లాక్‌ అయిందని, ప్రతిపక్షంలో కూర్చున్న బాధలో 13 రోజుల క్రితమే ఏర్పడిన జగన్‌ ప్రభుత్వంపై అసత్య విమర్శలు చేస్తున్నారని అనిల్‌ కుమార్‌ మండిపడ్డారు. ‘రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఆపేస్తున్నామని ఎవరు చెప్పారు? ఇకపై వాటి ని కొనసాగించబోమని మేమేమైనా ప్రకటన చేశామా? సాగునీటి ప్రాజెక్టుల పనితీరుపై కమిటీ ఏర్పాటు చేస్తాం. à°† కమిటీ సూచనల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది. ప్రాజెక్టులో అవినీతి లేకపోతే ప్రాజెక్టులను ఆపబోం. గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తడుముకోవడం చంద్రబాబుకు అలవాటైంది’ అని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు పనుల్లో అవినీతిని అరికట్టి ప్రజాధనాన్ని కాపాడడమే సీఎం జగన్‌ లక్ష్యమన్నారు. ఇందుకోసమే జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. à°—à°¤ ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఒక్క మేజర్‌ ప్రాజెక్టు అయినా ప్రారంభించిందా అని ప్రశ్నించారు. దివంగత వైఎస్‌ చేపట్టిన జలయజ్ఞంలోని ప్రాజెక్టులన్నీ రైతు పక్షపాతి జగన్‌ సారథ్యంలో ఐదేళ్లలో పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీరందిస్తామన్నారు.