శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేల సందడి

Published: Thursday June 13, 2019
శాసనసభ సమావేశాల తొలి రోజు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులంతా పసుపు చొక్కాలతో కొంత సందడి చేశారు. à°† పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేలు పసుపు చొక్కాలు, తెల్ల ఫ్యాంట్లతో వచ్చారు. à°† పార్టీకి చెందిన ఏకైక మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కూడా పసుపు చీరతో వచ్చారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం తెల్ల చొక్కాతో వచ్చారు. à°† లోటు కనిపించకుండా పసుపు కండవాలు వేసుకున్నారు. తెల్ల చొక్కా వేసుకొచ్చిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను.. మంత్రి కొడాలి నాని పట్టుకున్నారు. అసెంబ్లీ లాబీల్లో వారిద్దరూ ఎదురుపడినప్పుడు.. ‘మీ వాళ్లంతా పసుపు చొక్కాలు వేసుకొస్తే నువ్వెందుకు వేసుకురాలేదు’ అని కేశవ్‌ను అడిగారు. ఎన్నికల సమయంలో విజయవాడలోని ఇల్లు ఖాళీ చేసి అనంతపురం వెళ్లిపోయానని, దాంతో పసుపు చొక్కాలన్నీ అక్కడే ఉండిపోయాయని కేశవ్‌ చెప్పారు.
 
‘అయినా.. టీడీపీలో ఉండి వెళ్లిన వాడివి కదా.. నీకు పసుపు చొక్కాలు సహా అన్నీ గుర్తుంటాయి’ అని ఆయన చమత్కరించగా.. నాని నవ్వుకుంటూ వెళ్లిపోయారు. కాగా.. సమావేశాల తొలి రోజు అసెంబ్లీకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు à°† పార్టీ ఎమ్మెల్యేలు, టీడీఎల్పీ కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. సీనియర్‌ ఎమ్మెల్యే కరణం బలరాం ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. పోయిన సభలో ఉప సభాపతిగా వ్యవహరించిన మండలి బుద్ధ ప్రసాద్‌ కార్యాలయాన్ని ఈసారి ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు కేటాయించారు. దానికి సమీపంలోనే à°—à°¤ సభలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి కేటాయించిన గదులు ఉన్నాయి. ఈసారి à°† గదులు తమకు కేటాయించాలని కోరాలని టీడీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. à°—à°¤ సభలో టీడీపీ వినియోగించిన కార్యాలయ గదులు ఈసారి ఎవరికీ ఇవ్వలేదు. వాటికి తాళాలు వేసి ఉంచారు. స్పీకర్‌ ఎన్నిక తర్వాత గదుల కేటాయింపుపై నిర్ణయం జరుగుతుందని అంటున్నారు.
.
సమావేశాలకు హాజరయ్యే ముందు టీడీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి సమీపంలోని వెంకటపాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. చంద్రబాబు నాయకత్వంలో వారంతా ఊరేగింపుగా అక్కడకు వెళ్లారు. వారికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. వారంతా పెద్ద పెట్టున ఎన్ఠీఆర్‌ అమర్‌ రహే... టీడీపీ జిందాబాద్‌ అని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.అసెంబ్లీ లాబీల్లో కూడా బాలయ్య సందడి కనిపించింది. అనేక మంది ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు.