మద్య నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక

Published: Sunday June 16, 2019

మద్యాన్ని ప్రజలకు దూరం చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ à°Žà°‚.à°Žà°‚.నాయక్‌ తెలిపారు. à°ˆ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని, దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ఎక్సైజ్‌ అధికారులకు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. మద్యనిషేధం భవిష్యత్‌ కార్యాచరణపై కమిషనర్‌ మాటల్లోనే.. 


నవరత్నాల అమలును రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌à°—à°¾ తీసుకుంది. నవరత్నాల్లో ఒకటైన దశలవారీ మద్యపాన నిషేధం అంశాన్ని నిత్యం జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు సమీక్షించాలి. ఇందుకు గాను ఆయా జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు మా వైపు నుంచి లేఖలు రాస్తున్నాం. మద్యం లైసెన్సీలతో సమావేశాలు నిర్వహించాలని, ప్రభుత్వ విధానం స్పష్టంగా చెప్పాలని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలిచ్చాం. మద్యం షాపుల ఎదుట ఎమ్మార్పీ బోర్డులు పెట్టాలని మా శాఖ మంత్రి నారాయణ స్వామి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఉల్లంఘనలు ఎక్కడైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మా శాఖ డీసీలు, ఏసీలు కొన్ని సమస్యలు చెప్పారు. ఎక్సైజ్‌ స్టేషన్ల రీఆర్గనైజేషన్, నిధుల విడుదల వంటి కొన్ని అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాం.  


మద్యం అక్రమ అమ్మకాలు, ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు షాపులపై ఫిర్యాదులు చేసేందుకు కమీషనరేట్‌లో టోల్‌ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశాం. ప్రజలు 1800 425 4868 నెంబరుకు ఫిర్యాదులు చేయవచ్చు. అన్ని ప్రభుత్వ శాఖలు మద్యపాన నియంత్రణకు సహకరించాలి. సమాచార శాఖను సంప్రదిస్తున్నాం. సినిమా హాళ్లలో మద్యపాన నియంత్రణపై ప్రచారం చేసేందుకు ఆలోచిస్తున్నాం. సినిమా హాళ్లలో స్లైడ్‌à°² ద్వారా, గ్రామాల్లో కళాజాతల ద్వారా మద్యపాన నియంత్రణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. బెల్టు షాపుల్ని అరికట్టడం, ఎమ్మార్పీ ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేయడంలో ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులు అందిస్తాం.