అమరావతిలో స్తంభించిన లావాదేవీలు.. ఆందోళనలో

Published: Monday June 17, 2019
 à°…న్ని రంగాలపై స్పష్టమైన ప్రభావం చూపే రియల్‌ ఎస్టేట్‌ దారెటనేది అగమ్యగోచరంగా ఉంది. రాజధాని సహా జిల్లావ్యాప్తంగా స్థలాలు, భూములు, పొలాలు, ఇళ్ళ నిర్మాణాలు స్తంభించాయి. గతంలో నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో చావుదెబ్బ తిన్న రియల్‌ఎస్టేట్‌ à°°à°‚à°—à°‚ à°† తరువాత కొద్దిగా కోలుకున్నప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం మారడం... కొత్త ప్రభుత్వం పంథా తెలియకపోవడంతో కొంత సందిగ్ధంలో ఉంది. గతంలో రాజధానిలో గజం రూ.25వేలు వరకు ధర పలికితే అదే స్థలం ఇప్పుడు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు దిగి వచ్చింది. అయినప్పటికీ కొనేవారు కనిపించడం లేదు. గతంలో à°Žà°•à°°à°‚ రూ.కోటి నుంచి కోటిన్నర వరకు ధర పలకగా ప్రస్తుతం à°† ధర కొంత మేర తగ్గినప్పటికీ అక్కడ కూడా కొనుగోళ్లకు ఆసక్తి చూపేవారు కనిపించడం లేదు. రాజధానికి సమీప 20 కిలోమీటర్ల పరిధిలో గతంలో పెద్ద ఎత్తున రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, భూముల క్రయ విక్రయాలు సాగినప్పటికీ ప్రస్తుతం à°† పరిస్థితి లేదు. ఇక్కడ చోటు చేసుకుంటున్న రాజకీయ, ప్రభుత్వపరమైన పరిణామాలను అంతా నిశితంగా గమనిస్తున్నారు. కొంతమంది అనుకూల పరిస్థితులు ఏర్పడితే పెట్టుబడులు పెట్టవచ్చనే భావనలో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున హైదరాబాద్‌ వైపు దృష్టి సారించారు.
 
రాజధాని పరిధిలోని తుళ్ళూరు, తాడికొండ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, గుంటూరు తదితర మండలాల పరిధిలోని గ్రామాల్లోని రైతుల్లో కొంత ఆందోళన నెలకుంది. రాజధాని అభివృద్ధిపైనే భూములు, స్థలాల ధరలు ఆధారపడి ఉండడంతో ఏం జరగబోతోందని ప్రభుత్వ తీరును గమనిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో గతంలో ధరలు పెరిగిన సమయంలో అనేకమంది కుటుంబ అవసరాలకు ఎకరం, అరెకరం అమ్ముకున్నారు. మరికొందరు ఇప్పటికప్పుడు తమ భూములు విక్రయించకపోయినప్పటికీ రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం అవుతుంది.