20న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న జగన్‌

Published: Tuesday June 18, 2019
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం సవరించిన తుది అంచనాలను(రూ.55,548.77 కోట్లు) కేంద్ర జలసంఘం నేతృత్వంలోని సాంకేతిక సలహా సంఘం(టీఎసీ) ఇప్పటికే ఆమోదం తెలిపింది. దానిని తాజాగా ఆర్థిక శాఖ ఆమోదానికి పంపిన ట్లు తెలిసింది. దీనిపై చర్చించేందుకు à°ˆ నెల 25à°¨ ఢిల్లీలో కీలక భేటీ జరగనుంది. à°ˆ నేపథ్యంలో à°ˆ నెల 20à°¨ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నూరు శాతం వ్యయా న్ని కేంద్రమే భరిస్తుందని నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ కోసం ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ని ఏర్పాటు చేశారు.
 
 
అయితే త్వరితగతిన ప్రాజెక్టును పూర్తిచేసేందుకు à°ˆ బాధ్యతను రాష్ట్రప్రభుత్వానికే అప్పగించాలని నీతి ఆయోగ్‌ సూచించడంతో కేంద్రం నిర్వహణ బాధ్యతను రాష్ట్రానికి కట్టబెట్టిం ది. 2005-06లో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.10,151.04 కోట్లు. 2010-11 నాటికి ధరలు పెరగడంతో రూ.16,010.45 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్‌)కు టీఏసీ ఆమోదం తెలిపింది. 2014లో ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చింది. 2017-18 నాటికి పెరిగిన ధరలు, కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం సహాయ పునరావాస కార్యక్రమాలను అమలు చేయాల్సి రావడంతో అంచనా వ్యయం పెరిగింది. 2010-11లో భూసేకరణ, పునరావాసం కోసం రూ.12,996 కోట్లు అంచనా వేయగా ఇప్పుడది అమాంతం రూ.32,509 కోట్లకు చేరింది.
 
 
ముంపునకు గురయ్యే గ్రామాలు 317కి పైనే ఉన్నాయి. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పునరావాసం, నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి వస్తుండడంతో ఈ పద్దు వ్యయం అ మాంతం పెరిగిపోయింది. దరిమిలా రాష్ట్రప్రభుత్వం రూ.55,548.87 కోట్లకు తుది అంచనాలను సవరించింది. అనేక చర్చలు, సంప్రదింపులు, సమావేశాల అనంతరం సవరించిన అంచనాలకు టీఏసీ సార్వత్రిక ఎన్నికల ముందు ఆమోదం తెలిపింది. ఇప్పుడా ఫైలును కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదానికి పంపించారు. పనులు 71.20 శాతం పూర్తి: తాజా సమాచారం ప్రకారం మొత్తంగా పోలవ రం ప్రాజెక్టు నిర్మాణ పనులు 71.20% మేర పూర్తయ్యాయి. కుడి ప్రధాన కాలువ 91.49%, ఎడమ ప్రధాన కాలువ 71.60 % పనులు పూర్తయ్యాయి. కేంద్రం ఆమోదంతో భూసేకరణ, పరిహారం చెల్లింపు పనులను శరవేగంగా చేపట్టవచ్చు. ప్రాజెక్టు కోసం 1,66,423 ఎకరాల భూమి అవసరం. ఇందులో ఇప్పటికే 1.10 లక్షల ఎకరాలను సేకరించారు. ఇంకా 55 వేల ఎకరాలు సేకరించాల్సి ఉంది.