ఏపీలో చేపట్టిన చర్యలకు వరల్డ్‌ బ్యాంకు కితాబు

Published: Friday June 28, 2019

ఏపీలో ప్రజారోగ్య సేవల నాణ్యతను పెంచేందుకు రూ.2265.25కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం అందనుంది. à°ˆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ బ్యాంకు అధికారులు రుణ ఒప్పంద పత్రాలపై గురువారం ఢిల్లీలో సంతకాలు చేశారు. à°ˆ మొత్తం అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు(ఐబీఆర్డీ) నుంచి వస్తాయి. రుణ కాలపరిమితి 23ఏళ్లు కాగా, ఆరేళ్లు అదనపు గడువు లభిస్తుంది. రాష్ట్రంలో వైద్యసేవలను మెరుగుపర్చేందుకు రాష్ట్రప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధి కనబరిచిందని, 2017-18 బడ్జెట్‌లో 5ు ఆరోగ్య రంగానికి కేటాయించిందని ప్రపంచ బ్యాంకు భారతదేశం విభాగం డైరెక్టర్‌ జునైద్‌ అహ్మద్‌ ప్రశంసించారు. ఏపీలో ప్రతి 5721 మందికి à°’à°• పీహెచ్‌సీ ఉందని, ప్రతి 2లక్షల మందికి సెకండరీ సంరక్షణ సౌకర్యం నెలకొల్పారని ప్రపంచ బ్యాంకు టాస్క్‌ లీడర్‌ మోహన్‌ కక్‌ వివరించారు. దీనిని కొనసాగించాలని సూచించారు. కాగా, ఏపీలో ఆరోగ్య సంరక్షణను మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒప్పంద పత్రాలపై సంతకం చేసిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి సమీర్‌ కుమార్‌ ఖరే తెలిపారు.