పరిపాలన చేతగాక చంద్రబాబుపై పడుతున్నారు

Published: Saturday June 29, 2019
పరిపాలన చేతగాక.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం బురదజల్లుతోందని తెలుగుదేశం పార్టీ మండిపడింది. à°† పార్టీకి అధికారమిచ్చింది కక్ష తీర్చుకోవడానికేనా అని నిలదీసింది. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉంటున్న అద్దె ఇంటికి అన్ని నిర్మాణ అనుమతులు ఉన్నాయని తేల్చిచెప్పింది. అద్దెకు ఉంటున్న పాపానికి à°† ఇల్లు కూలగొట్టి ఆయన్ను ఇబ్బంది పెట్టడానికే జగన్‌ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి హడావుడి చేస్తోందని దుయ్యబట్టింది. శుక్రవారం ఉదయం ఇక్కడ చంద్రబాబు నివాసంలో à°† పార్టీ నేతల సమావేశం జరిగింది. à°† ఇంటికి సీఆర్‌డీఏ అధికారులు వచ్చి నోటీసులు à°…à°‚à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ వ్యవహారం కూడా చర్చకు వచ్చింది. అనంతరం నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రులు నిమ్మకాయల à°šà°¿à°¨ రాజప్ప, పితాని సత్యనారాయణ, కళావెంకట్రావు, పి.నారాయణ తదితరులతో కలిసి టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు అక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇల్లు 2007లో నిర్మించారు. అప్పటికి సీఆర్‌డీఏ లేదు. అప్పట్లో à°ˆ ప్రాంతం గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. దాని నుంచి అప్పుడే నిర్మాణ అనుమతి తీసుకున్నారు. జీ ప్లస్‌ వన్‌à°—à°¾ à°ˆ ఇంటి నిర్మాణం జరిగింది. పంచాయతీకి అంతవరకే నిర్మాణ అనుమతి ఇచ్చే అధికారం ఉంది.
 
అందుకే అంతవరకే కట్టారు. నదీ పరివాహక పరిరక్షణ చట్టం à°•à°¿à°‚à°¦ కూడా ఇరిగేషన్‌ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఇంటికి అనుబంధంగా స్విమ్మింగ్‌ ఫూల్‌, వస్త్రాలు మార్చుకునే గది నిర్మాణానికి à°† శాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. à°ˆ అనుమతులు కూడా 2007లోనే లభించాయి. అప్పట్లో ఇవన్నీ వ్యవసాయ భూములు. వాటిలో నిర్మాణాలు చేపట్టాలంటే భూ మార్పిడి చేసుకోవాలి. దాని కోసం ఇంటియజమాని ప్రభుత్వానికి రూ.18 లక్షలు కూడా చెల్లించారు. à°ˆ ఇల్లు అక్రమ నిర్మాణమైతే à°ˆ అనుమతులు ఎలా ఇచ్చారు? à°ˆ డబ్బు ఎలా కట్టించుకున్నారు’ అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. స్వరాష్ట్రం నుంచి పరిపాలన సాగించాలని నిర్ణయించుకుని ఇక్కడకు వచ్చిన చంద్రబాబు à°ˆ ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు à°ˆ అనుమతులన్నీ చూసుకునే అందులోకి దిగారని చెప్పారు. ‘పోనీ.. ఏదైనా పొరపాటు జరిగిందనుకుందాం. నాలుగు రోజులు ఆగితే ప్రపంచం తలకిందులవుతుందా? చంద్రబాబు పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్‌ నేత. విడిపోయిన రాష్ట్రానికి ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. నలభై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రతిష్ఠాత్మక స్థాయికి ఎదిగారు. ప్రతిపక్ష నేతగా ఆయనకు ప్రభుత్వమే à°’à°• నివాసం కేటాయించాలి. ఇప్పుడేదో à°’à°• ఇంటిలో ఉంటున్నారు.
 
దానిని కూడా ఖాళీ చేయాలని నోటీసివ్వడంలో ఆంతర్యం ఏమిటి? రాష్ట్ర ప్రజలు ఇంత పెద్ద మెజారిటీతో మీకు అధికారం ఇచ్చింది ఆయన వెంటపడమనా? ఆయన తప్ప రాష్ట్రంలో ప్రజల సమస్యలు మీకు పట్టవా? జూన్‌ చివరివారం వచ్చినా వానలు లేక కరువుతో రైతులు అల్లాడుతున్నారు. పడిన నాలుగు చినుకులకు వేయడానికి విత్తనాలు లేక à°°à°¾ యలసీమలో రైతాంగం రోడ్లపైకి వచ్చి ఆందోళన చే స్తోంది. ధాన్యం అమ్మిన రైతులకు ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదు. మీరు అధికారంలోకి వచ్చి 30 రోజులైంది. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని అవమానించడం తప్ప ఒక్క ప్రజా సమస్య పరిష్కరించారా? ప్రతిపక్ష నేతను ఇంత పనిగట్టుకుని అవమానించడం దేశంలో మరెక్కడా లేదు. పాలన చేతగాక... à°—à°¤ ప్రభుత్వం మొదలుపెట్టినవి కొనసాగించడం ఇష్టం లేక.. చంద్రబాబుపై బురదజల్లుతున్నారు’ అని విమర్శించారు. ప్రజావేదికను కేటాయించాలని కోరినందుకు కూల్చివేశారని, దానికి అడగకపోయి ఉంటే అది అలాగే ఉండేదేమోనని వ్యాఖ్యానించారు.