అధికారపార్టీ చర్యలను అధిగమించే ప్రయత్నాలు

Published: Saturday June 29, 2019

టీడీపీకి చెందిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సైకిల్‌దిగి కమలం చేతపట్టుకున్నారు. శుక్రవారం ఆయన ఢిల్లోలో బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, ఏపీ, తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జి రామ్‌మాధవ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఆయన కొద్దిరోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో à°† పార్టీ శ్రేణుల దుందుడుకు చర్యలపై పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అదే సందర్భంలోనే ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో à°’à°• కార్యకర్త మృతిచెందడంతో ఆయన కలత చెందారు. ఇదే నేపథ్యంలో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు. సూరి తీరు గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథితోపాటు మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కాలవ శ్రీనివాసులు తదితరులు సూరితో మాట్లాడారు. అప్పటికి కొంతశాంతంగా ఉన్న ఆయన à°† తరువాత తన ఆలోచన గురించి గురువారం కార్యకర్తలతో పంచుకున్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ పాలన అభివృద్ధి సూచకంగా ఉందని, à°† పార్టీలో చేరికతో అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చుననే అభిప్రాయాలు మెజారిటీ కార్యకర్తల నుంచి రావడంతో ఎట్టకేలకు à°† పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. జూలై 5à°¨ బీజేపీలో చేరేందుకు ఆయన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. కానీ.. అప్పటికప్పుడు బీజేపీ అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో శుక్రవారమే ఆయన ఢిల్లీకి చేరుకుని జేపీ నడ్డా, రామ్‌మాధవ్‌ను కలిసి కాషాయ కండువా కప్పుకున్నారు.