తెలుగు రాష్ట్రాల పొలాలు పచ్చగా కళకళలాడాలి

Published: Saturday June 29, 2019
‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండూ వేర్వేరు అనే భావన మాకు లేదు. రెండు రాష్ర్టాల ప్రజలు బాగుండాలన్నదే మా అభిమతం. రెండు తెలుగు రాష్ర్టాలు పచ్చగా కళకళలాడాలి. వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటి కొరత రాకుండా చూడాలనే లక్ష్యంతో ఉన్నాం. అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా, సమర్థంగా వినియోగించి రెండు తెలుగు రాష్ర్టాల్లోని ప్రతి మూలకూ సాగు, తాగునీరు అందించేందుకు కలిసి ముందుకు సాగుతాం’’ అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించారు. నదీ జలాల వినియోగానికి సంబంధించి గతంలో ఉన్న వివాదాలను గతం గతః అన్న రీతిలో మర్చిపోయి.. మంచి మనసుతో రెండు రాష్ర్టాలకు à°Žà°‚à°¤ వీలైతే à°…à°‚à°¤ మేలు చేసేందుకు ఏకాభిప్రాయంతో ఉన్నామని స్పష్టం చేశారు. రెండు రాష్ర్టాల ప్రయోజనాల కోసం ఉభయ ప్రభుత్వాలు పని చేస్తాయని తెలిపారు. నదీ జలాల పంపకాలు సహా విభజన సమస్యలన్నిటినీ రెండు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని, మూడో వ్యక్తులు, సంస్థల ప్రమేయం అవసరం లేదని నిర్ణయించారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో ఏపీలోని రాయలసీమ, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలు ఎదుర్కొంటున్న దశాబ్దాల సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు గోదావరి నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ఇందుకు వ్యూహం ఖరారు చేయాలని అధికారులకు నిర్దేశించారు.
 
హైదరాబాద్‌లోనే రెండు రోజులపాటు సమావేశమై విభజన సమస్యలు, నదీ జల వివాదాలు, ట్రైబ్యునళ్ల తీర్పులు, సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు, 9, 10 షెడ్యూళ్ల సంస్థల సమస్యలు, ఉద్యోగుల బదలాయింపు, విద్యుత్తు బకాయిలు తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవాలని, సదరు ప్రతిపాదనలను తమ వద్దకు తీసుకొస్తే వాటికి ‘గ్రీన్‌ సిగ్నల్‌’ ఇస్తామని స్పష్టం చేశారు. రెండు రాష్ర్టాల మధ్య నెలకొన్న సమస్యలను సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల తొలి అధికారిక సమావేశం ప్రగతి భవన్‌లో శుక్రవారం జరిగింది. తొలుత, మంత్రులు, అధికారులతో కలిసి ఉదయం 11.15 గంటలకు జగన్‌ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. వారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర తెలంగాణ మంత్రులు ఘన స్వాగతం పలికారు. à°ˆ సందర్భంగా, తెలంగాణ అధికారులను జగన్‌కు కేసీఆర్‌ పరిచయం చేశారు. అనంతరం, జగన్‌ను కేసీఆర్‌ తన చాంబర్‌కు తీసుకెళ్లారు. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. à°† తర్వాత ఇరువురూ 11.30 గంటలకు సమావేశ మందిరానికి చేరుకున్నారు. à°ˆ సందర్భంగా నదుల్లో నీటి లభ్యతపై కేసీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. గోదావరి, కృష్ణా, వాటి ఉప నదులపై ఎగువ రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక లెక్కలేనన్ని బరాజ్‌లు నిర్మించాయని, దాంతో, కిందికి నీళ్లు రాని పరిస్థితి ఉందని వివరించారు. సీడబ్ల్యూసీ గణాంకాల ప్రకారం ఏ పాయింట్‌ వద్ద à°Žà°‚à°¤ నీటి లభ్యత ఉందో వివరించారు.